శనివారం 06 జూన్ 2020
Wanaparthy - May 14, 2020 , 02:15:44

బాధితులకు అండ సీఎంఆర్‌ఎఫ్‌

బాధితులకు అండ సీఎంఆర్‌ఎఫ్‌

  • ఎమ్మెల్యే ఆల

కొత్తకోట/అడ్డాకుల : అనారోగ్యం బారిన పడి దవాఖానల్లో చికిత్సలు చేయించుకున్న వారికి సీఎం రిలీఫ్‌ఫండ్‌ కొండంత అం డగా నిలుస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండ లం తిమ్మాయిపల్లి సర్పంచ్‌ ఆంజనేయులుకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్‌ఎఫ్‌ కింద మంజూరైన రూ.లక్ష, అలాగే వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన జర్నలిస్ట్‌ నాగరాజు కుమారుడు సంజయ్‌సాగర్‌కు రూ.2లక్షల ఎల్వోసీలను బుధవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే ఆల అందించారు.  ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరూ అధైర్యపడొద్దని, సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్‌ వైద్య రంగానికి పెద్దపీట వేశారని అన్నారు. అనంతరం ఎల్వోసీలను మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు బాధితులతోపాటు వనపర్తి జెడ్పీ వైస్‌ చైర్మన్‌ వామన్‌గౌడ్‌, ఎంపీపీ గుంతమౌనిక ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  


logo