గురువారం 28 మే 2020
Wanaparthy - May 12, 2020 , 02:07:58

కూలీలకు వరప్రసాదంగా ‘ఉపాధి హామీ’

కూలీలకు వరప్రసాదంగా ‘ఉపాధి హామీ’

మక్తల్‌ రూరల్‌ : కరోనా కారణంగా గ్రామాల్లో పనుల్లేక ఇ బ్బందులు పడుతున్న కూలీలకు ఉపాధి హామీ పథకం వరప్రసాదంగా మారిందని నారాయణపేట జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజ పే ర్కొన్నారు. సోమవారం మక్తల్‌ మండలం మంథన్‌గోడ్‌, ఎర్నాగన్‌పల్లి, గొళ్లపల్లి గ్రామాల్లో ఉపాధి పనులను జెడ్పీ చైర్‌పర్సన్‌ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ ఈజీఎస్‌ ద్వారా చెరువుల్లో ఒండ్రు మట్టి తరలించ డం, కాల్వల మరమ్మతులు, ఇంకుడు గుంతలు, ఫాంపాండ్స్‌ తదితర పనులు చేపట్టడానికి ప్రభుత్వం అనుమతించిందన్నా రు. కూలీలు కనీసం మీటరు దూరం పాటించి, మాస్కులు ధరించాలన్నారు. అనంతరం గొళ్లపల్లిలో కూలీలకు మాస్క్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజేందర్‌గౌడ్‌, ఏపీవో మాధవరెడ్డి, సర్పంచ్‌ మహదేవమ్మ, ఉప సర్పంచ్‌ కృష్ణయ్యగౌడ్‌, ఎంపీటీసీలు సుమిత్ర, బలరాంరెడ్డి పాల్గొన్నారు. 


logo