శనివారం 06 జూన్ 2020
Wanaparthy - May 12, 2020 , 02:08:02

రైతులకు ఇబ్బందుల్లేకుండా చూస్తాం

రైతులకు ఇబ్బందుల్లేకుండా చూస్తాం

  • వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

వనపర్తి/రూరల్‌/చిన్నంబావి : రైతులకు ఎలాంటి ఇ బ్బందుల్లేకుండా చూస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి మండలంలోని చిట్యాల గ్రామ శివారులో నూతనంగా నిర్మాణమవుతున్న మార్కెట్‌ యార్డును సోమవారం మంత్రి రైతులతో కలిసి పరిశీలించారు. మార్కెట్‌ యార్డ్‌ను ఆనుకొని ఉన్న పొలాలకు రోడ్డు మార్గం ఏర్పాటు గురించి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ఏర్పాటుకు గాను మార్కెట్‌ యార్డ్‌ పరిసరాలను పరిశీలించి సాధ్యాసాధ్యాలను తెలుసుకునేందు కు ఉన్నతాధికారులను త్వరలో రప్పించనున్నట్లు తెలిపారు. మార్కెట్‌ యార్డు పనులను నాణ్యవంతంగా, త్వ రగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం శ్రీరంగాపురం మండలం తాటిపాములకు చెంది న మొగిలికి సీఎం సహాయనిధి నుంచి వి డుదలైన రూ.46వేల చెక్కును మంత్రి నిరంజన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం లో అందజేశారు. చిన్నంబావి మండలంలోని పెద్దమారూర్‌ గ్రామంలో ఎంపీపీ సో మేశ్వరమ్మ గృహప్రవేశానికి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డి హజరయ్యారు. మండలాభివృద్ధిలో భాగంగా సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, కొల్లాపూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, సర్పంచ్‌ భానుప్రకాశ్‌రావు, విండో చైర్మన్‌ వెంకట్రావ్‌ పాల్గొన్నారు.


logo