శనివారం 30 మే 2020
Wanaparthy - May 10, 2020 , 02:38:57

మాస్కులు లేనందుకు జరిమానా

మాస్కులు లేనందుకు జరిమానా

  • వనపర్తిలో వందమందికి రూ.వెయ్యిచొప్పున
  • పలుచోట్ల దుకాణాదారులకు  ఫైన్‌ 

వనపర్తి/జడ్చర్ల/నాగర్‌కర్నూల్‌ టౌన్‌: లాక్‌డౌన్‌ సడలింపుతో మాస్కులు ధరించకుండా అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులు, పాదచారులకు, దుకాణా యజమానులకు మున్సిపల్‌ అధికారులు జరిమానా విధిస్తున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్‌చౌక్‌లో ఎస్పీ అపూర్వరావు ఆదేశాల మేరకు మున్సిపాలిటీ, పోలీస్‌ శాఖల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. మాస్కులు లేకుండా అనవసరంగా రోడ్లపై తిరిగే వాహనచోదకులకు, పాదచారులకు 100 మందికి ఒక్కొక్కరికీ రూ.1000 చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. జడ్చర్లలో మాస్క్‌ ధరించకుండా రోడ్లపైకి వచ్చిన నలుగురికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. నాగర్‌కర్నూల్‌లో మాస్క్‌లు లేకండా వ్యాపారాలు నిర్వహిస్తున్న 15 షాపుల యజమానులకు రూ.17 వేల 300 జరిమానా విధించినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేశ్‌ తెలిపారు. 


logo