ఆదివారం 31 మే 2020
Wanaparthy - May 09, 2020 , 02:48:40

ప్రతి మొక్కనూ బతికించాలి

ప్రతి మొక్కనూ బతికించాలి

వనపర్తి రూరల్‌ : ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో నాటిన ప్రతి మొక్కనూ బతికించాల్సిన అవసరం ఉందని జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని అంకూర్‌ గ్రా మంలో సర్పంచ్‌ విష్ణువర్ధన్‌రెడ్డితో కలిసి ‘చెట్టు చెట్టుకూ నీరు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ మండు వేసవిలో కూడా మొక్కలకు నిరంతరం నీళ్లు అందించి బతికించాలని సూచించారు. గ్రామంలో ప్రతి ఒ క్కరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులను విధిగా ధరించాలన్నారు. సవాయిగూడెం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో నాటిన 40 వేల మొక్కలకు జెడ్పీ సీఈవో నర్సింహులు, ఎంపీపీ కిచ్చారెడ్డి, సర్పంచ్‌ సువర్ణలతో కలిసి నీళ్లు పో శారు. కార్యక్రమంలో ఎంపీడీవో రఘునాథ్‌రెడ్డి, ఎంపీవో రవీంద్రబాబు, ఏపీవో సుకన్య తదితరులు పాల్గొన్నారు.


logo