బుధవారం 03 జూన్ 2020
Wanaparthy - May 09, 2020 , 02:48:41

నిత్యావసర సరుకుల పంపిణీ హర్షణీయం

నిత్యావసర సరుకుల పంపిణీ హర్షణీయం

  • ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

వెల్దండ : రేషన్‌కార్డులు లేని ప్రజలు లాక్‌డౌన్‌లో ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో బియ్యం, సరుకుల పంపిణీకి శ్రీ కారం చుట్టడం హర్షణీయమని నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు, ఎమ్మెల్యే జై పాల్‌యాదవ్‌ అన్నారు. శుక్రవారం తా సిల్దార్‌, దాతలు దాదాపు రూ.12 లక్షలతో 1300 మంది రేషన్‌ కార్డు లేని కు టుంబాలకు 15 కిలోల చొప్పున బి య్యం, 13 రకాల నిత్యావసర సరుకు ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు తాసిల్దార్‌, సిబ్బందిని అభినందించారు. కల్వకుర్తి నియోజకవర్గంలో పీఎంజీఎస్‌వై పథకం ద్వారా 12 బీటీ రోడ్లకు ప్రభుత్వం రూ.25 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీటీసీ విజితారెడ్డి, ఎంపీపీ విజయ, ఆర్డీవో రాజేశ్‌కుమార్‌, వైస్‌ ఎంపీపీ శాంతి, సీఐ నాగరాజు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత గోళి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రావు పాల్గొన్నారు.


logo