శనివారం 28 నవంబర్ 2020
Wanaparthy - May 07, 2020 , 02:27:28

నిరుపేదలకు అండగా దాతలు

నిరుపేదలకు అండగా దాతలు

  • కొనసాగుతున్న నిత్యావసర సరుకుల పంపిణీ

మహబూబ్‌నగర్‌ తెలంగాణ చౌరస్తా/అలంపూర్‌, నమస్తే తెలంగాణ /కొత్తకోట/గద్వాల రూరల్‌/వంగూరు/హన్వాడ/నారాయణపేట రూరల్‌/మరికల్‌/పెబ్బేరు/వనపర్తి రూరల్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి కోల్పోయినవారికి, నిరుపేదలకు, వలసకూలీలకు మేమున్నామంటూ దాతలు అండగా నిలుస్తున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేస్తూ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. అలంపూర్‌ మండల పరిధిలోని బుక్కాపురంలో ఫిట్‌ ఇండియా రాష్ట్ర కార్యదర్శి కనకం బాబు, జిల్లా కార్యదర్శి విజయ్‌కుమార్‌ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలంపూర్‌లో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు రాము సమకూర్చిన నిత్యావసర సరుకులను మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ చేతులమీదుగా ఏఎన్‌ఎంలకు, ఆశ కార్యకర్తలకు అందజేశారు. కొత్తకోట మున్సిపాలిటీలో 80నిరుపేద కుటుంబాలకు ‘మిషన్‌ నేను సైతం’ ఆధ్వర్యంలో సీఐ మల్లికార్జున్‌రెడ్డి, ఎస్సై నాగశేఖర్‌రెడ్డి కూరగాయలను పంపిణీ చేశారు. గద్వాల మండలంలోని సంగాల గ్రామానికి చెందిన ఎన్నారై నాగరాజు రూ.రెండున్నర లక్షలతో సమకూర్చిన నిత్యావసర సరుకులను ఏఎస్పీ కృష్ణ చేతులమీదుగా గ్రామస్తులకు పంపిణీ చేశారు. వంగూరు మండలంలోని 27 గ్రామపంచాయతీలకు జీబీఆర్‌ ట్రస్టు చైర్మన్‌ గువ్వల అమల నేతృత్వంలో సమకూర్చిన నిత్యావసర సరుకులను ఆయా గ్రామాలకు ఎంపీపీ భీమమ్మలాలూయాదవ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నరేందర్‌రావు పంపిణీ చేశారు. మహబూబ్‌నగర్‌లోని మార్కండేయ దేవాలయంలో పద్మశాలి విద్యార్థుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వగ్గు బాలరాజు ఆధ్వర్యంలో, హన్వాడ మండలంలోని టంకర, గొండ్యాల గ్రామాల్లో పేద ప్రజలకు, ఆటోడ్రైవర్లకు టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు శ్రీకాంత్‌గౌడ్‌ ఆధ్వర్యంలో వనపర్తి మండలంలోని పలు గ్రామాల్లో పరవస్తు క్రియేటివ్‌ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు మధుకర్‌ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. నారాయణపేట మండలంలోని తిర్మలాపూర్‌లో వ్యాపారి దేవులనాయక్‌ సమకూర్చిన నిత్యావసర సరుకులను సర్పంచ్‌ అంజమ్మ, ఎంపీటీసీ సభ్యుడు బస్స ప్ప చేతుల మీదుగా నిరుపేదలకు పంపిణీ చేశారు. మరికల్‌లో నవీన్‌ కుమార్‌ రెడ్డి, ఏబీవీపీ మండల కన్వీనర్‌ రాజేశ్‌ పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పెబ్బేరు మున్సిపల్‌ కార్యాలయంలో 40మంది జర్నలిస్టులకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కరుణశ్రీ నిత్యావసర సరుకులను అందజేశారు.