శనివారం 30 మే 2020
Wanaparthy - May 07, 2020 , 02:22:26

పేదలకు అండగా మంత్రి ఆపన్న హస్తం

పేదలకు అండగా మంత్రి ఆపన్న హస్తం

  • వనపర్తి జెడ్పీ చైర్మన్‌ లోకనాథరెడ్డి 

వనపర్తి, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలకు మంత్రి ఆపన్నహస్తం అండగా ఉంటుందని జెడ్పీ చైర్మన్‌ లోకనాథరెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని 12వ వార్డులో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆపన్నహస్తం పేరుతో అందిస్తున్న నిత్యావసర సరుకులను మున్సిపాలిటీ చైర్మన్‌ గట్టుయాదవ్‌, స్థానిక కౌన్సిలర్‌ అలివేలతో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, తెలంగాణ మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌, నాయకులు అంజయ్య, బాలస్వామి పాల్గొన్నారు.


logo