శనివారం 06 జూన్ 2020
Wanaparthy - May 07, 2020 , 02:22:27

పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి

పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి

  • ఘణపురం బ్రాంచ్‌ కెనాల్‌ పనులను 
  • పరిశీలించిన మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి,నమస్తే తెలంగాణ/ ఖిల్లాఘణపురం: పెండింగ్‌ పనుల్లో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే వారిని తొలిగించి కొత్తవారికి పనులను అప్పగించి పనులు పూర్తిచేసేలా చూడాలని మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఖిల్లాఘణపురం మండలంలోని ఘణపురం బ్రాంచ్‌ కెనాల్‌పై జరుగుతున్న పనులను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. త్వరితగతిన పెండింగ్‌ పనులను పూర్తిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.ఘణపురం బ్రాంచ్‌ కెనాల్‌ చుట్టు పక్కల ఉన్న ప్రతి చెరువు సాగునీటితో నిండి కళకళలాడాలన్నారు. మండలంలోని మామిడిమాడ, షాపూర్‌, పర్వతాపూర్‌, అల్లమాయిపల్లి, అప్పారెడ్డిపల్లి, ఖిల్లాఘణపురం, మానాజీపేట కాలువ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖిల్లాఘణపురం మండలంలో బీడువారిన భూములను సస్యశ్యామలం చేసేందుకు ఆహర్నిషలు కృషి చేసి సాగునీరు తీసుకొచ్చి రైతుల కండల్లో ఆనందాన్ని చూస్తున్నామన్నారు. ఘణపురం బ్రాంచ్‌ కెనాల్‌ను పూర్తిచేసి మండలానికి సాగునీరు అందిస్తున్నామన్నారు. అదేవిధంగా బ్రాంచ్‌ కెనాల్‌పై జరుగుతున్న పెండింగ్‌ పనులను ప్రణాళిక ప్రకారం వానకాలం నాటికి పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. మామిడిమాడ, నేరేడు చెరువు పనులు నత్తనడకన నడుస్తున్నాయని వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

రోడ్డు వెడల్పునకు అందరూ సహకరించాలి

జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ పనులకు అందరూ సహకరించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. హైదరాబాద్‌ ప్రధాన రహదారి వెడల్పునకు తామంతా సిద్ధంగా ఉన్నామని, కాగా ఈ విషయమై నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రోడ్ల విస్తరణ బాధితులు మంత్రి నిరంజన్‌ రెడ్డికి క్యాంపు కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. బాధితులకు తగిన న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, మాజీ కౌన్సిలర్‌ నాగేశ్వరరావు, పట్టణ యూత్‌ అధ్యక్షుడు సూర్యవంశం గిరి ఉన్నారు. logo