శనివారం 30 మే 2020
Wanaparthy - May 06, 2020 , 02:17:14

కానాయపల్లి పునరావాస కేంద్రం పనులను పూర్తి చేయాలి

కానాయపల్లి పునరావాస కేంద్రం పనులను పూర్తి చేయాలి

  • వనపర్తి కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా 

వనపర్తి, నమస్తే తెలంగాణ : కానాయపల్లి పునరావాస కేంద్రానికి సంబంధించి మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా ఆదేశించారు. మంగళవారం ఆమె తన కార్యాలయ సమావేశ మందిరంలో కానాయపల్లి, నాగరాల పునరావాస కేంద్రాల పనుల పురోగతిపై ఇంజినీరింగ్‌, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కానాయపల్లికి సంబంధించి 1,034 మంది నిర్వాసితులకు గాను ఇప్పటివరకు 194 మందికి మినహా అందరికీ పునరావాస లబ్ధి చేకూరిందని, నాగరాలకు సంబంధించిన అన్ని పనులను పూర్తిచేసి, నిర్వాసితులకు సీ ఫారాలను అందజేశామని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. కానాయపల్లిలో మిగిలిన వారికి త్వరలో సీ ఫారాలను ఇవ్వాలని, ఈ విషయంపై గ్రామంలో తుది ప్రకటన జారీ చేయాలని కలెక్టర్‌ సూచించారు. నిర్దేశించిన సమయంలోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, ఆర్డీవో చంద్రారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. logo