బుధవారం 03 జూన్ 2020
Wanaparthy - May 06, 2020 , 02:17:12

నిబంధనలను పాటిద్దాం

నిబంధనలను పాటిద్దాం

గోపాల్‌పేట : వనపర్తిని గ్రీన్‌జోన్‌లోనే ఉంచేందుకు ప్రతి ఒక్క రూ ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జెడ్పీ చైర్మన్‌ రాకాసి లోకనాథ్‌రెడ్డి కోరారు. మండలంలోని బుద్ధారం గ్రామంలో టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకుడు శ్రావణ్‌కుమార్‌ తన సొంత ఖర్చులతో 20 మంది ఆశ కార్యకర్తలకు, పారిశుధ్య కార్మికులకు సమకూర్చిన నిత్యావసర సరుకులను మంగళవారం జెడ్పీ చైర్మన్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ భార్గవి, సర్పంచ్‌ పద్మమ్మ, ఉపసర్పంచ్‌ నాగరాజు, ఎంపీటీసీ శ్రీదేవి, సింగిల్‌విండో చైర్మన్‌ రఘు యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ రాములు, పంచాయతీ కార్యదర్శి రాధిక, టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రేమ్‌నాథ్‌రెడ్డి, శేఖర్‌, రాజు పాల్గొన్నారు.


logo