ఆదివారం 31 మే 2020
Wanaparthy - Apr 27, 2020 , 02:04:05

హంగూ ఆర్భాటాలొద్దు..

హంగూ ఆర్భాటాలొద్దు..

  • టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం సందర్భంగా నేటి నుంచి వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు
  • కరోనాను సమష్టిగా ఎదుర్కోవాలి
  • వైద్యుల సేవలు అమోఘం : ఎక్సైజ్‌ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: క రోనా నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఎ లాంటి హంగూ ఆర్భాటాల్లేకుండా నిర్వహించుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా సో మవారం నుంచి వారం రోజుల పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాల ని తెలిపారు. ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఉ ద్యమ నేత కేసీఆర్‌ ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీ 20వ వ సంతంలోకి అడుగుపెట్టడం ఎంతో గొప్ప విషయమని అన్నా రు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేపట్టిన నాడే రాష్ట్రం ఏర్పడితే అద్భుతాలు చేయొచ్చని కేసీఆర్‌ చెప్పారని.. అన్నట్లుగానే చేసి చూపిస్తున్నారని పేర్కొన్నారు. నాడు ఉద్యమ నేతగా, నేడు సీఎంగా దేశానికే ఆదర్శంగా నిలిచారని చెప్పారు.  టీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీగా ఎదుగుతుందని.. సీఎం కేసీఆర్‌ జాతీ య అధ్యక్షుడిగా, కేటీఆర్‌ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉంటారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనాపై చేస్తున్న పోరాటం ప్రపంచానికే స్ఫూర్తినిచ్చేలా ఉందని, అది సీఎం కేసీఆర్‌ వల్లే సాధ్యమైందని వివరించారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా నేతలు, కార్యకర్తలు, అభిమానులు అంతా కలిసి కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు కృషి చేయాలన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులు రక్తం నిల్వలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, వారి కోసం వారం పాటు రక్తదాన శిబిరాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పేదలకు సాయం చేయాలన్నారు. కుల మతాలు, పార్టీలకతీతంగా సేవా కార్యక్రమాలు ఉండాలన్నారు. కరోనా కట్టడిలో భాగంగా నిత్యం రోడ్లపైకి వచ్చి పనిచేస్తున్న తనను చూసి ప్రతిపక్షాలకు చెందిన అనేక మంది ప్రధాన నేతలు ఫోన్‌ చేసి జాగ్రత్తగా ఉండాలని కోరారని గుర్తు చేశారు. పార్టీలకతీతంగా కరోనాను కట్టడి చేసేందుకు సిద్ధం అ వ్వడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. హైదరాబాద్‌ త ర్వాత మహబూబ్‌నగర్‌లో కరోనా వ్యాప్తి అత్యధికంగా ఉండబోతోందని పలువురు హెచ్చరించారని.. అయితే ఎన్నో జాగ్రత్తలు తీసుకుని వైరస్‌ వ్యాపించకుండా చర్యలు తీసుకున్నామ ని తెలిపారు. ఓ వైపు కరోనాపై పోరాటం చేస్తూనే.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సీఎం కేసీఆర్‌ చర్యలు చేపట్టారన్నారు. కరోనాపై పోరులో ప్రజల సహకారం ఎంతో అవసరమని, ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తి మేరకు ప్రజలంతా ఇండ్లకే పరిమితమై.. వైరస్‌ కట్టడికి సహకరించాలని మంత్రి చేతులెత్తి విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ర్టాల్లో తెలంగాణ ప్రజలను స్వరాష్ర్టానికి వెళ్లిపోమన్నా.. మనం మాత్రం ఇతర రాష్ర్టాల వారిని ఆదుకున్న విధానాన్ని, సీఎం కేసీఆర్‌ గొప్పతనాన్ని దేశమంతా గు ర్తించిందన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఉన్న వేలాది మంది కడుపునింపుతూ మంత్రి కేటీఆర్‌ వారికి అండగా ఉంటున్నారన్నారు. ఎక్కడికక్కడే ధాన్యం కొనుగోళ్లతో రైతుల ఇబ్బందులు తీరడమే కాకుండా దాదాపు మూడు రాష్ర్టాల ప్రజల ఆకలి తీర్చే స్థాయికి తెలంగాణ చేరుకుందన్నా రు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన తీరుగానే త్వరలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసి సీఎం కేసీఆర్‌ పాలమూరుకు భరోసా ఇవ్వనున్నట్లు తెలిపారు. కరోనాపై పోరులో వైద్యుల సేవలు ఎంతో విలువైనవని అన్నారు. అలాగే ప్రముఖ పాత్ర పోషిస్తున్న వారిలో జర్నలిస్టులు, పారిశుధ్య కార్మికులు కూడా ఉన్నారని తెలిపారు. సమావేశంలో సంగీత, నాటక అకాడమీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కోరమోని వెంకటయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆంజనేయులు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గణేశ్‌, పార్టీ సీనియర్‌ నేతలు బెక్కెం జనార్దన్‌, ఇంతియాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఏనుగొండ శాంతివనంలో నేడు రక్తదాన శిబిరం..

పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, రెడ్‌క్రాస్‌, నిర్మల్‌ డయోగ్నోస్టిక్స్‌ ఆధ్వర్యంలో ఏనుగొండ శాంతివనంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఏ ర్పాటు చేయనున్న రక్తదాన, వైద్య శిబిరాలను మంత్రి ప్రారంభించనున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజల రక్షణే ప్రభుత్వ బాధ్యత

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ : కరోనా నుంచి ప్రజలను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని, సీఎం కేసీఆర్‌ లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేస్తున్నారని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పాలకొండ, సుబ్రహ్మణ్యతండా, ఆర్‌వీఎం హాల్‌, మార్కండేయ కాలనీ, మోనప్పగుట్ట, తెలంగాణ చౌరస్తా, వన్‌టౌన్‌ ప్రాంతాల్లో ప్రజలకు ని త్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌లో కేసులు తగ్గాయన్నారు. ఆర్యసమాజ్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం తెలంగాణ, వన్‌టౌన్‌ చౌరస్తాలను పరిశీలించారు. చౌరస్తాల ను సుందరీకరంగా తీర్చిదిద్దుతామన్నారు. అశోక్‌టాకీస్‌ చౌరస్తాలోని మార్కండేయ ఆలయంలో పద్మశాలీ ఉద్యోగులకు జిల్లా అధ్యక్షుడు వగ్గు బాల్‌రాజ్‌ 200 మంది పేదలకు అందజేసిన సరుకులను మంత్రి పంపిణీ చేశారు. ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 74వేల లీటర్లు, జీహెచ్‌ఎంసీ, ప్రభుత్వ అనుబంధ సంస్థలకు 1.40 లక్షల లీటర్ల శానిటైజర్లను పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలకు 2 వేల లీటర్ల చొప్పున మొత్తం 10 వేల లీటర్లను పంపిణీ చేశామన్నారు. టీఎస్‌ఎంఐడీసీకి 60 వేల లీటర్లు, మెదక్‌ జిల్లాకు 3 వేల లీటర్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాకు 500 లీటర్లను ఇప్పటికే పంపిణీ చేయగా, జీహెచ్‌ఎంసీకి 40 వేల లీటర్ల మేరకు ఈ వారంలో అందజేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ తాటిగణేశ్‌, కౌన్సిలర్లు, పద్మశాలీ సంఘం సభ్యులు డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌, సుకుమార్‌, బాల్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo