శనివారం 30 మే 2020
Wanaparthy - Apr 24, 2020 , 01:56:51

చేతులెత్తి మొక్కుతాం.. బయటకు రావొద్దు

చేతులెత్తి మొక్కుతాం.. బయటకు రావొద్దు

‘చేతులెత్తి మొక్కుతున్నా.. ఇండ్లల్లోంచి ఎవ్వరూ బయటకు రావొద్దు’ అం టూ వనపర్తి సీఐ సూర్యానాయక్‌ వాకింగ్‌కు వచ్చిన వారిని వేడుకున్నారు. గు రువారం జిల్లా కేంద్రంలోని ఎకో పార్కు, సూర్యచంద్ర స్కూల్‌ ప్రాంతంలో గుం పులు గుంపులుగా వాకింగ్‌ చేస్తున్న వారి దగ్గరకు వెళ్లి మాట్లాడారు. పక్క జిల్లాలైన గద్వాల, కర్నూల్‌లలో భయానక పరిస్థితులున్నప్పటికీ ఏ ధైర్యంతో విచ్చలవిడిగా రోడ్లపైకి వచ్చి వాకింగ్‌ చేస్తున్నారని ప్రశ్నించారు. చదువుకున్న వారు కూడా బయటకు రావడం దురదృష్టకరమని, అందరూ పోలీసులకు సహకరించాలని చేతులెత్తి వేడుకున్నారు. సీఐ వెంట పట్టణ, రూరల్‌ ఎస్సైలు వెంకటేశ్‌గౌడ్‌, షేక్‌షఫీ, సత్యనారాయణ ఉన్నారు.                        

 - వనపర్తి టౌన్‌


logo