మంగళవారం 01 డిసెంబర్ 2020
Wanaparthy - Apr 13, 2020 , 03:07:46

కడుపు నింపుతున్న అన్నదాతలు

కడుపు నింపుతున్న అన్నదాతలు

వనపర్తి, నమస్తే తెలంగాణ/ఖిల్లాఘణపురం/ధన్వాడ/నారాయణపేట టౌన్‌/తిమ్మాజిపేట/దేవరకద్ర రూరల్‌/కొత్తకోట/అయిజ/ఊట్కూర్‌: వనపర్తి జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆదివారం నిరాశ్రయులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. అదేవిధంగా ఖిల్లాఘణపురం ప్రభుత్వ దవాఖానలో వైద్య సిబ్బంది, పోలీస్‌, రెవెన్యూ, శానిటేషన్‌ సిబ్బందికి జిల్లా రజక సంఘం ఉపాధ్యక్షుడు విజయ్‌ అల్పాహారం అందజేశారు. కార్యక్రమంలో ఎస్సై రామస్వామి, గోపాల్‌ పాల్గొన్నారు. ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్‌ నాయకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా నారాయణపేట జిల్లా దవాఖాన ఆవరణలో భావ సమాఖ్యఆధ్వర్యంలో పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు జయమ్మ పేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. బీజేపీ నాయకుడు నారాయణ ఆధ్వర్యంలో రైతుబజార్‌లో రైతులకు అల్పాహారం అందజేశారు. అదేవిధంగా తిమ్మాజిపేటకు చెందిన యువకులు సురేందర్‌,రవిలు మండల కేంద్రంతోపాటు, మరికల్‌ గ్రామంలో అన్నదానం చేశారు. అదేవిధంగా దేవరకద్రకు చెందిన స్నేహ బృందం బాల్‌రాజ్‌, సత్యం, బాలాజీలు పోలీస్‌స్టేషన్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా కొత్తకోట మండలంలోని రాయణిపేట స్టేజీ 44వ జాతీయ రహదారిపై గ్రామ అంబేడ్కర్‌, గాంధీ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగింది. అదేవిధంగా అయిజ మున్సిపాలిటీలో సేవలందిస్తున్న వలంటీర్లకు 10వ వార్డు కౌన్సిలర్‌ మేకల అనిత నాగిరెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఊట్కూర్‌ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులకు సర్పంచ్‌ సూర్యప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్దపొర్ల గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు రఘు మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు. 

అనాథలకు, పోలీసులకు అన్నదాన కార్యక్రమం 

వనపర్తి,నమస్తే తెలంగాణ: వనపర్తి పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌లో తిరుమల సరస్వతీ డెవలపర్స్‌ మేనిజింగ్‌ డైరెక్టర్‌ తిరుమల మహేశ్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్‌ నేపథ్యంలో గతంలో సీఎం సహాయనిధికి విరాళం ఇవ్వడం జరిగిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, నాయకులు గోపాల్‌యాదవ్‌ తదితరులు ఉన్నారు.