బుధవారం 27 మే 2020
Wanaparthy - Apr 06, 2020 , 01:56:10

అనాథలకు అన్నదానం

అనాథలకు అన్నదానం

మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ/టౌన్‌/క్రైం/మరికల్‌/వనపర్తి టౌన్‌/కల్వకుర్తి రూరల్‌/నాగర్‌కర్నూల్‌ టౌన్‌/బిజినేపల్లి : విశ్వమద్వ పరిషత్‌ ఉత్తరాది మఠం పాలమూరు శాఖ, పరశురాం అర్చక పురోహితుల ఆధ్వర్యంలో మ హబూబ్‌నగర్‌ పట్టణ కేంద్రంలో ప్రధాన రోడ్లతోపాటు వీధుల్లో ఆకలితో ఉన్న వారికి ఆదివారం భోజనం అందించారు. అలాగే న్యూగంజ్‌, ము న్సిపల్‌ గెస్ట్‌హౌస్‌, స్టేషన్‌ రోడ్డు, న్యూమోతీనగర్‌లో బీసీ మేధావుల సంఘ ఆధ్వర్యంలో అల్పాహారం, టీ, నీళ్ల ప్యాకెట్లు అందజేశారు. మున్సిపాలిటీ గెస్ట్‌ హౌజ్‌లోని నిరాశ్రయు లు, అనాథలకు మహబూబ్‌నగర్‌ టీచర్స్‌ కాలనీ వరసిద్ధి వినాయక సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదానం చే శారు. లాక్‌డౌన్‌లో పనిచేస్త్తున్న అధికారులు, గ్రామంలోని అనాథలకు మరికల్‌ మండల కేంద్రానికి చెందిన గౌడ రాఘవేందర్‌ అన్నదానం చేశారు. పండ్ల వ్యాపారి మల్లేశ్‌ తనవంతు సహాయంగా అధికారులు, అనాథలకు పండ్లు పంపిణీ చేశారు. వనపర్తి జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న పోలీస్‌ సి బ్బందికి గోపాల్‌ టిఫిన్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో ఉచిత భోజనాన్ని అందజేశారు. కల్వకుర్తి బస్టాం డ్‌ పరిసరాలలో సంచరించే వృద్ధులు, భిక్షాటన చేసేవారికి కల్వకుర్తి మండలం మార్చాల సత్యసాయినగర్‌ సీసీఎస్‌ చర్చి సభ్యులు అన్నదానం చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా దవాఖానలో సత్యసాయి సేవాసమితి, సాయి ప్రశాంతి చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది, రోగులకు అన్నం పొట్లాలు అందజేశారు. వారితోపాటు పా రిశుధ్య కార్మికులకు మాస్కులు అందజేశారు. ద వాఖానలో అత్యవసర చికిత్సకోసం వచ్చే వారి కి, విధుల్లో ఉన్న వారికి సర్వింగ్‌ హ్యాండ్స్‌ సర్వ్‌ ఫర్‌ గ్రీన్‌ తుఫెయిత్‌ సంస్థ ఆధ్వర్యంలో ఏరియా దవాఖాన, తాడూరు సమీపంలోని ప్రభుత్వ క్వా రంటైన్‌ సెంటర్‌కు, నిస్సహాయులకు, అన్నదా నం, మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. బిజినేపల్లి మండల కేంద్రంలో వాసవీ క్లబ్‌ ఆధ్వర్యంలో పో లీసులకు రెండోరోజు అన్నదానం చేశారు. మంగనూరుకు చెందిన బేతిష్ట గచ్పల్‌ చర్చ్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలను వలస కూలీలు, బాటసారులు, అనాథలు, పోలీసులకు పంచిపెట్టారు. కోస్గిలో పోలీసులు, వలంటీర్లు, వైద్య సిబ్బంది, రోగులకు షిర్డీ సాయిసేవాదల్‌ ఆ ధ్వర్యంలో అన్నదానం చేశారు.


logo