గురువారం 04 జూన్ 2020
Wanaparthy - Apr 05, 2020 , 03:40:06

ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

  • కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం విక్రయించాలి
  • వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
  • రాజపేట, కొత్తకోటలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

వనపర్తి, నమస్తే తెలంగాణ/రూరల్‌/కొత్తకోట : రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా రాజపేట, కొత్తకోట పీఏసీసీఎస్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా, డీసీసీబీ చైర్మన్‌ నిజాంపాషాతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయని, నాలుగు వారాల పాటు కొనసాగుతాయని తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని సర్కారే కొనుగోలు చేయాలని నిర్ణయించిందన్నారు. ఐకేపీ, పీఏసీసీఎస్‌ల ద్వారా సివిల్‌ సప్లయ్స్‌ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తారని తెలిపారు. రాష్ట్రంలో ఏడు వేల పైచిలుకు కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయని, గతంలో 3 వేల మాత్రమే ఉండేవని గుర్తు చేశారు. ఈ యాసంగిలో జిల్లాలో లక్షా 25 వేల ఎకరాలలో వరి పంట సాగైందని తెలిపారు. కొనుగోళ్లకు సంబంధించి డబ్బులను ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేస్తుందని ఆయన తెలిపారు. టోకెన్‌ సిస్టం ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌, జిల్లా సహకార అధికారి కోదండ రాములు, జిల్లా వ్యవసాయ అధికారి శివనాగిరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ వంశీచందర్‌రెడ్డి, సర్పంచ్‌ జ్యోతి మాధవరెడ్డి, ఎంపీపీ కిచ్చారెడ్డి, రాజనగరం, నాగవరం పీఏసీఎస్‌ చైర్మన్లు విజయ్‌కుమార్‌, మధుసూదన్‌రెడ్డి, వైస్‌ చైర్మన్లు రఘునందన్‌రెడ్డి, సంపత్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాసులు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జయమ్మ, గొర్రెల పెంపకందారుల సంఘం చైర్మన్‌ కురుమూర్తి యాదవ్‌, మండల అధ్యక్షుడు విష్ణుయాదవ్‌, ఎంపీటీసీ శాంతమ్మ, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.

దాతలు ముందుకురావాలి : మంత్రి 

  కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా దాతలు ముందుకు రావాలని మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. శనివారం జిల్లా కేంద్రలోని క్యాంప్‌ కార్యాలయంలో గద్వాల జిల్లా మానవపాడు మండలం కలుకుంట్లలో ఉన్న నది బయో ప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఎండీ మురళీకృష్ణమూర్తి, వైస్‌ ప్రెసిడెంట్‌ సత్యసాయిరాం తరుపున వారి మేనేజర్‌ చంద్రహాస్‌రెడ్డి 400 లీటర్ల శానిటైజర్‌ క్యాన్లను మంత్రి నిరంజన్‌రెడ్డికి అందించారు. అలాగే స్కాలర్స్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ వారు రూ.లక్ష చెక్కును అందించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, మున్సిపాలిటి కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, స్కాలర్‌ జూనియర్‌ కళాశాల డైరెక్టర్‌ జగదీశ్వర్‌, వరప్రసాద్‌, నాగేశ్వర్‌రెడ్డి, డాక్టర్‌ సత్యనారాయణ తది తరులు పాల్గొన్నారు. 


logo