బుధవారం 25 నవంబర్ 2020
Wanaparthy - Apr 05, 2020 , 03:36:49

ఆపదలో అండగా..

ఆపదలో అండగా..

  • నిరాశ్రయులకు అల్పాహారం అందజేత
  • ఔదార్యం చాటిన స్వచ్ఛంద సంస్థలు

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ/జడ్చర్ల/మహబూబ్‌ నగర్‌ క్రైం/నాగర్‌కర్నూల్‌ టౌన్‌/బిజినేపల్లి/కల్వకుర్తి రూరల్‌/కొత్తకోట/గద్వాల రూరల్‌/జడ్చర్ల/ నారా యణపేట టౌన్‌ : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కరోనా నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలు, పలువురు ముందుకొచ్చి నిరాశ్రయులకు అండగా నిలుస్తు న్నారు. అల్పాహారం, భోజనం అందిస్తూ తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా బాదేపల్లి మున్సిపాలిటీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 130 భోజన ప్యాకెట్లను కమిషనర్‌ సునీత పంపిణీ చేశారు. అలాగే జిల్లా మైనార్టీ ఫ్రంట్‌ అధ్యక్షుడు హఫీజ్‌ ఉర్‌ రహ్మాన్‌ 44వ హైవేపై వెళుతున్న ప్రయాణికులకు ఆహార ప్యాకెట్లను అందించారు. పాలమూరులో లక్ష్మీనారాయణ స్వచ్ఛం ద సంస్థ నిర్వాహకులు 11 రోజులుగా అల్పాహారం అందిస్తున్నారు. రైల్వే స్టేషన్‌ సమీపంలో మతిస్థిమితం లేని బీహార్‌కు చెందిన ముకేష్‌కు స్నానం చేయించి కొత్త బట్టలు అందించి ఆనందం మానవత్వం చాటుకున్నాడు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గాయత్రి యాదవ్‌ దంపతులు ఐదు రోజులుగా పేదలకు అన్నదానం నిర్వహిస్తున్నారు. వనపర్తి పట్టణంలో విధులు నిర్వర్తిస్తున్న వైద్య, మున్సిపల్‌, పోలీస్‌, జర్నలిస్టులకు మణి కలెక్షన్‌ ఆధ్వర్యంలో రూ.10 వేల విలువైన మజ్జిగ, కూల్‌ డ్రింగ్స్‌, బాదంపాలు, వాటర్‌, బిస్కెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. గద్వాల జిల్లా కేంద్రానికి సమీపంలోని జములమ్మ ఆలయ పరిసరాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు సతీష్‌ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. నారాయణపేట మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్‌ నవలే జయశ్రీ విజయ్‌ ఆధ్వర్యంలో 150 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందికి శనివారం అన్నదానం నిర్వహించారు. చేశారు. బిజినేపల్లి వాసవీక్లబ్‌ ఆధ్వర్యంలో శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పోలీసులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కల్వకుర్తి పట్టణం, బస్టాండ్‌ పరిసరాలలో సంచరించే వృద్ధులకు, భిక్షాటన చేసే వారికి సుభాష్‌నగర్‌ గచ్చు బావి యూత్‌ సభ్యులు అన్నదానం ఏర్పాటు చేశారు.