సోమవారం 25 మే 2020
Wanaparthy - Mar 17, 2020 , 02:56:06

ఢబుల్‌ ధమాకా

ఢబుల్‌ ధమాకా

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభు త్వం పేదల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బె డ్‌రూం ఇండ్ల నిర్మాణాలు జిల్లాలో వేగంగా జరుగుతున్నాయి. జిల్లా పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో ని ర్మాణాలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని కొల్లాపూర్‌, దేవరకద్ర, మక్తల్‌, వనపర్తి నియోజకవర్గాలకు గాను 2,340 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో వనపర్తికి 1400, దేవరకద్రకు 346, మక్తల్‌ కు 80, కొల్లాపూర్‌కు 514 ఇండ్లు ఉన్నాయి. కాగా, వ నపర్తి మినహా మిగిలిన మూడు నియోజకవర్గాల్లో జి ల్లా పరిధిలో వచ్చిన మండలాలకు మాత్రమే ఈ ఇండ్లు మంజూరయ్యాయి. 

పురోగతిలో 1127 ఇండ్లు..

జిల్లావ్యాప్తంగా 2,340 ఇండ్లు మంజూరు కాగా, 2,218 ఇండ్లకు టెండర్లు పిలవగా, 1,387 ఇండ్లకు టెండర్లు పూర్తయ్యాయి. వీటిలో 1,127 ఇండ్లు వివిధ దశల్లో పురోగతిలో ఉండగా, కొన్ని చివరి దశలో ఉన్నా యి. వనపర్తి నియోజకవర్గంలో 100 ఇండ్లను పూర్తి చేయగా, ఇటీవలే శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రె డ్డిలు ప్రారంభించారు. అయితే, లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాల్సి ఉన్నది. 

రూ.14.97 కోట్లతో 

నిర్మాణాలు..

జిల్లాలో దాదా పు రూ.14.97 కో ట్లతో ప్రభుత్వం ఇం డ్లను నిర్మించి ఇస్తున్న ది. కాగా, ముందుగా మంజూరైన వనపర్తి, దేవరక ద్ర నియోజకవర్గాల్లోని నిర్మాణాలకు ఈ నిధులు మంజూరై ఉన్నాయి. ఇ టీవల మక్తల్‌, కొల్లాపూర్‌ నియోజకవర్గాలకు 594 ఇం డ్లను ప్రభుత్వం మంజూరు చేయగా, ఇంకా నిధులను కేటాయించాల్సి ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇండ్లకు రూ.5.04 లక్షలు, పట్టణాల్లో నిర్మించే వాటికి రూ.5.25 లక్షల చొప్పున కేటాయించారు. ఇప్పటి వర కు జరిగిన ఇండ్ల పనులకు సంబంధించి దాదాపు రూ. 14 కోట్ల బిల్లులను కాంట్రాక్టర్లకు చెల్లించింది. టెండర్ల ప్రక్రియ పూర్తై నిర్మాణాలు కూడా చివరి దశకు చేరుకు న్న వాటికి ప్రభుత్వం వెనువెంటనే బిల్లులు చెల్లిస్తున్న ది. ఇటీవలి బడ్జెట్‌ కేటాయింపులతో నిలిచిన బిల్లులను సైతం చెల్లించే అవకాశం ఉన్నది. ఇటీవలి బడ్జెట్‌లో గృ హనిర్మాణాల కోసం ప్రభుత్వం రూ.11,917 కోట్లను కేటాయించడంతో, జిల్లాకు మరిన్ని ఇండ్లు మంజూరయ్యే అవకాశం ఉన్నది.

మంజూరైన గ్రామాల వివరాలు..

వనపర్తి మున్సిపాలిటీ, మెంటెపల్లి, కర్నెతండా, చె న్నారం, పెబ్బేరు, నాగవ రం, రాజపేట, మం గంపల్లి, వీరాయిపల్లి, పెద్దమందడి, గార్లబం డ తండా, కోతులకుం ట తండా, ఈర్లతం డా, విలియంకొండ తండా, మిరాశిపల్లి, పా మాపూర్‌, మదనాపురం, తిరుమలాయిపల్లి, ఆత్మకూ రు, ఆరేపల్లి, దేవరపల్లి, కత్తెపల్లి, తిప్పడంపల్లి, అమరచింత, పాన్‌గల్‌, పెద్దమారూర్‌, కొప్పునూరు, గడ్డబస్వాపూర్‌, అయ్యవారిపల్లి గ్రామాలకు ఇండ్లు మంజూరయ్యాయి.

పనులు వేగంగా జరుగుతున్నాయి.. 

డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే వంద ఇండ్లు పూర్తికాగా వాటి ని మంత్రులు ప్రారంభించారు. లబ్ధిదారుల ఎంపిక జరగాల్సి ఉన్నది. 36 చోట్ల 2,340 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల మంజూరయ్యాయి. వీటిలో 1127 ఇండ్లు పురోగతిలో ఉన్నాయి. ఇంకా కొన్నింటికి టెండర్లు కావాల్సి ఉంది. కాంట్రాక్టర్లు ముందుకు రాగానే ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం.

- శివకుమార్‌, ఈఈ, పంచాయతీరాజ్‌ శాఖ, వనపర్తి


logo