గురువారం 02 ఏప్రిల్ 2020
Wanaparthy - Mar 08, 2020 , 01:40:32

ఆర్డీఎస్‌ ఆనకట్టకు కొనసాగుతున్న నీటి విడుదల

ఆర్డీఎస్‌ ఆనకట్టకు కొనసాగుతున్న నీటి విడుదల

అయిజ : కర్ణాటకలోని టీబీ డ్యాం నుంచి ఆర్డీఎస్‌ ఆనకట్టకు నీటి విడుదల కొనసాగుతోంది. టీబీ డ్యాం నుంచి 2,500 క్యూసెక్కుల నీటిని తెలంగాణ రాష్ట్ర అవసరాలకు విడుదల చేస్తున్నారు. శనివారం టీబీ డ్యాం నుంచి 2,500 క్యూసెక్కుల నీటిని తుంగభద్ర నదిలోకి విడుదల చేశారు. అలంపూర్‌ నియోజకవర్గంలోని ఆర్డీఎస్‌ ఆయకట్టుకు సాగునీరు, తాగునీటి అవసరాలకు విడుదల చేశారు. టీబీ డ్యాం నుంచి విడుదలైన నీరు తుంగభద్ర నదిలో ప్రవహిస్తూ ఈ నెల 10వ తేదీ నాటికి ఆర్డీఎస్‌ ఆనకట్టకు చేరుకుంటుందని ఆర్డీఎస్‌ ఏఈఈ ఆంజనేయులు తెలిపారు. ఆర్డీఎస్‌ ఆనకట్టకు నీరు చేరగానే ఆయకట్టుకు విడుదల చేస్తామని ఆర్డీఎస్‌ ఏఈఈ తెలిపారు. 

తుంగభద్ర డ్యాంలో 24.692 టీఎంసీలు 

కర్ణాటకలోని టీబీ డ్యాంలో ప్రస్తుతం నీటి మట్టం 24.692 టీఎంసీలు ఉన్నది. శనివారం టీబీ డ్యాం నుంచి 7,850 క్యూసెక్కులు విడుదల చేశారు. టీబీ డ్యాం ద్వారా కర్ణాటక పరిధిలోని కాల్వలతోపాటు ఏపీ రాష్ట్రంలోని ఆయకట్టుకు సాగునీరు అందించే హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ కాల్వలు, తెలంగాణ రాష్ట్రంలోని ఆయకట్టు, తాగునీటి అవపసరాలకు నీటిని విడుదల చేస్తున్నట్లు టీబీ బోర్డు సెక్షన్‌ అధికారి విశ్వనాథ తెలిపారు. టీబీ డ్యాంలో ప్రస్తుతం 24.692 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, 1603 అడుగుల నీటి మట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. logo
>>>>>>