గురువారం 02 ఏప్రిల్ 2020
Wanaparthy - Mar 08, 2020 , 01:40:32

ముందు జాగ్రత్తలు అవసరం

ముందు జాగ్రత్తలు అవసరం

వనపర్తి, నమస్తే తెలంగాణ : ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే కరోనా వైరస్‌ సంక్రమణను అరికట్టవచ్చని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా తెలిపారు. శనివారం ఆమె తన ఛాం బర్లో కరోనా వైరస్‌ అవగాహన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని కోరారు. కరోనా వైరస్‌ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు, కరోనా బారిన పడినట్లు ఎవరికైనా అనుమానం ఉన్నవారు నిర్ధ్దారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 040-24651119 లేదా వనపర్తి జిల్లా హెల్ప్‌లైన్‌ నంబర్‌ 77288064701ను సంప్రదించాలన్నారు. కరోనా లక్షణాలున్నవారు 14 రోజుల వరకు ప్రత్యేక గదిలో ఉండాలని, ఇతరులతో కలవకూడదని, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు చేతి రుమాలును అడ్డుపెట్టుకోవాలని, తరుచూ సబ్బు నీటితో చేతలను శుభ్రంగా కడుక్కోవాలని కోరారు. ఎవరికైనా కరోనా వైరస్‌ పరీక్షలు అవసరమైతే 108లో హైదరాబాద్‌కు తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. జిల్లా దవాఖానలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామని, ము గ్గురు డాక్టర్లు, ఆరు మంది నర్సులు, వైద్య సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. 

అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్‌ తన చాంబర్లో సమావేశమయ్యారు. క రోనా గురించి వచ్చే వదంతులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దన్నారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలను తీసుకుంటామన్నారు. జిల్లాలో కరోనా లేకున్నప్పటికీ, ప్రజల్లో అవగాహన పెంచాలని, ఇందుకు విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలని ఆదేశించారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సులను నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, డీపీఆర్వో వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌వో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 


logo