సోమవారం 30 మార్చి 2020
Wanaparthy - Mar 08, 2020 , 01:38:48

పంట మార్పిడితోనే అధిక దిగుబడులు

పంట మార్పిడితోనే అధిక దిగుబడులు

ఖిల్లాఘణపురం : పంట మార్పిడి వి ధానంతోనే అధిక దిగుబడులు సాధించవచ్చని మండల వ్యవసాయ అధికారి ర ఘురాం పేర్కొన్నారు. శనివారం మండలంలోని పర్వతాపూర్‌ గ్రామంలో పా లెం వ్యవసాయ కళాశాల, రావెప్‌ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సును ఎంపీపీ కృష్ణానాయక్‌, సర్పం చ్‌ నిర్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ ప్రతిఏటా ఒకేపంట పండించడం వల్ల విత్తనోత్పత్తి లాభదాయకంగా ఉండదని, పంట మార్పిడితోనే ఎక్కువ దిగుబడి సా ధించవచ్చన్నారు. పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థులు వివిధ రకాల పంట లు, వ్యవసాయ రంగానికి ఉపయోగపడే వినూత్న ప్రదర్శనలతో స్టాల్‌ ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించారు. ఆయా గ్రామాల నుంచి వచ్చిన రైతుల సమస్యలకు సూచనలు, సలహాలు ఇచ్చా రు. కార్యక్రమంలో సింగిల్‌విండో అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, జెడ్పీటీసీ సామ్యనాయక్‌, సింగిల్‌విండో వైస్‌ చైర్మన్‌ రా జు, రైతులు పాల్గొన్నారు. 


logo