మంగళవారం 31 మార్చి 2020
Wanaparthy - Mar 07, 2020 , 00:19:09

జీఎస్టీపై అవగాహన అవసరం

జీఎస్టీపై అవగాహన అవసరం

వనపర్తి క్రీడలు: పన్ను చెల్లింపు విషయంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని చీఫ్‌ కమిషనర్‌ మల్లిక ఆర్య అన్నారు. శుక్రవారం జిల్లా కేం ద్రంలోని మైస్‌ ఫంక్షన్‌ హాల్‌లో హైద రాబాద్‌ జోన్‌, రంగారెడ్డి సెంట్రల్‌ జీ ఎస్టీ కమిషనర్‌ కార్యాలయం వారి ఆధ్వర్యంలో ‘జిల్లాలోని సెంట్రల్‌ జీఎస్టీ మీ వద్దకు’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హైదరాబాద్‌ జోన్‌ కేంద్ర జీఎస్టీ కమిషనర్‌ మల్లిక ఆర్య హాజరై ఆమె చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వ ల చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎస్టీ సంబంధించిన వాటాదారులను దేశ అభివృద్ధికి బిల్డింగ్‌ బ్లాక్స్‌ అని ప్రశంసించారు. పన్ను చెల్లింపుదారులలో వారి సమస్యలను చాలా వర కు పరిష్కరించడానికి జీఎస్టీ శాఖ చేస్తున్న వివిధ ప్రయత్నాలను ఆమె వివరించారు. ఆర్థిక మంత్రి నిర్మల సీ తారామన్‌ మార్గదర్శకాలపై తెలంగాణ రాష్ట్రంలోని పన్ను చెల్లింపుదారునికి చేరవేయడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 7వ తేదీ వరకు ఈ అవగాహన కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జీఎస్టీపై అవగాహన కల్పించడం దేశంలో ఇదే మొదటి సారి అని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యాపారవేత్తలు, కన్సల్టెంట్స్‌, టాక్‌ ప్రాక్టీషనర్లు, ఆడిటర్లు పాల్గొన్నారు. ఏప్రిల్‌ నుంచి అమలులోకి రానున్న కొత్త రిటర్న్‌ దాఖలు, ఈ ఇన్వాయిస్‌ వ్యవస్థ, ఇ న్పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌, జీఎస్టీ చట్టంలో ఇటీవల కొన్ని పెద్ద మార్పులకు సంబంధించిన ముఖ్యమైన పరిణామాలు ప వర్‌ పాయింట్‌లో ప్రదర్శించారు. కన్సల్టెంట్స్‌, ఆడిటర్లు చేసిన కొన్ని సూచనలను కేంద్ర ప్రభుత్వ సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకువస్తామని ఆమె హామి ఇచ్చారు. ఇంటనాక్టివ్‌లో ట్రేడ్‌ అండ్‌ టాక్స్‌ కన్సల్టెంట్స్‌ అడిగిన ప్రశ్నలకు చీఫ్‌ కమిషనర్‌ స్పష్టత ఇచ్చా రు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జీఎస్టీ కమిషనర్‌, కేంద్ర జీఎస్టీ శాఖ కమిషనర్‌ కేసీ జానీ, అదనపు కమిషనర్‌ కే బాలకిషన్‌ రాజు, అసిస్టెంట్‌ క మిషనర్‌ కే శేషగిరిరావు, సూపరింటెండెంట్లు రమణ శర్మ, జే సురేశ్‌బాబు, ప్రతాప్‌, ఎస్‌ఆర్‌కే రెడ్డి, రాచకొండ శ్రీనివాస్‌, శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. logo
>>>>>>