గురువారం 02 ఏప్రిల్ 2020
Wanaparthy - Mar 05, 2020 , 23:36:02

కరోనా అలర్ట్

కరోనా అలర్ట్

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా మహమ్మారిపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీ సుకునేలా అవగాహన కల్పిస్తున్నది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయి తే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా దవాఖానలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఎనిమిది పడకలతో కూడిన ప్రత్యేక వార్డును జి ల్లా దవాఖాన వెనుక భాగంలో సిద్ధం చేశారు. మందులను కూడా వైద్య, ఆరోగ్య శాఖ సిద్ధం గా చేసుకున్నది. జిల్లా వైద్యాధికారి పర్యవేక్షణలో ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ దవాఖానల్లో తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారి ని ప్రత్యేకంగా గమనిస్తున్నారు. స్థానికులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తు లు అనారోగ్యం బారిన పడితే వెంటనే గుర్తిం చి చర్యలు తీసుకునేందుకు కింది స్థాయిలో ఆరోగ్య శాఖ ఉద్యోగులు, సిబ్బందికి తగిన సూచనలు చేశారు.


అనుమానితులకు అత్యవసర చికిత్స..

జిల్లాలో ఎక్కడైనా కరోనా వ్యాధి అనుమానితులుంటే అత్యవసర చికిత్సకు అవసరమైన ఏర్పాట్లను కూడా జిల్లా దవాఖానలో వేగం గా చేపట్టారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వ్యక్తులను తక్షణమే తరలించి పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. కరోనా వ్యాధిపై ఇటు సీఎం కేసీఆర్‌, అటు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌లు రాష్ట్ర నలుమూలలా ప్ర జలను చైతన్యం చేయడం, వ్యాధి లక్షణాలు బయట పడితే చికిత్సలు నిర్వహించడం లాంటి చర్యలు భరోసాగా నిలుస్తున్నాయి.


పరిశుభ్రంగా ఉంటే దరిచేరదు..

కరోనా వ్యాధి ప్రబలకుండా ప్రధానంగా పరిశుభ్రతను పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబుతో కూ డిన ఆయాసం లాంటి లక్షణాలు తీవ్రంగా ఉ న్న వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చే తులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడం, షేక్‌హ్యాండ్‌లకు దూరంగా ఉండాలి. జనసంచార ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండా లని, రద్దీ ప్రాంతాలకు వెళ్లడం తప్పనిసరైతే మా స్క్‌లను ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.


logo
>>>>>>