శనివారం 28 మార్చి 2020
Wanaparthy - Mar 05, 2020 , 02:15:36

88గంటలు.. 1236 కి.మీ.

88గంటలు.. 1236 కి.మీ.

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ: ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సందేశాన్ని చాటిచెప్పేలా అందరినీ చైతన్య పర్చడమే లక్ష్యంగా ప్రారంభించిన సైక్లింగ్‌లో దిన దినాభివృద్ధి చెందుతున్నాడు అమరచింత నరేందర్‌రెడ్డి. అమరచింత పట్టణానికి చెందిన మారెడ్డి నరేందర్‌రెడ్డి సైకిల్‌ రైడర్‌గా ఎన్నో పథకాలను ఇప్పటికే సాధించాడు. తాజాగా గత ఆదివారం బెంగళూరులో జరిగిన రాండ్‌డొన్నరస్‌ అడ్వంచెర్‌ ఎల్‌ఆర్‌ఎం రైడ్‌ లో బెంగళూరు నుంచి గోవా.. తిరిగి బెంగళూరు చేరే సైక్లింగ్‌లో నరేందర్‌రెడ్డి మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. మొత్తం 1236 కిలోమీటర్లను 88 గంటల్లో పూర్తిచేసి అరుదైన చరిత్రను లిఖించాడు. దేశం మొత్తంలో 50 మంది రైడర్లు పాల్గొన్న ఈ చా లెంజింగ్‌ రేస్‌లో 23 మంది ఫీట్‌ను సాధించగా, తె లుగు రాష్ర్టాల నుంచి మన జిల్లా, అమరచింత నరేందర్‌రెడ్డి ఈ ఘనతను సాధించాడు. తెలంగాణ వ్యాప్తంగా ఒకేఒక్కడిగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు నరేందర్‌రెడ్డి. 


పగలు, రాత్రి తేడాలేకుండా పర్వత రహదారుల్లో, షిమోగా, జాగ్‌ఫాల్స్‌, కుమ్‌ తా కర్వార్‌, మార్గో, మోల్లెం జాతీయ పార్క్‌, సూపా రిజర్వాయర్‌, దండేలి టైగర్‌ రిజర్వ్‌, ఎల్లాపూర్‌ ఫారెస్ట్‌, దావణగిరి, తుమ్‌కూర్‌ల మీదుగా ఈ రైడింగ్‌ను నరేందర్‌రెడ్డి పూర్తిచేశాడు. ఈ దారుల్లో దాదాపు 200 కిలోమీటర్ల వెస్టర్న్‌ ఘాట్స్‌లో ప్రయాణం చే యడం కఠినతరం. అలాంటి రహదారుల్లో దాదాపు 14,073 మీటర్ల ఎత్తు పర్వత రహదారుల్లో 1,236.27 కిలోమీటర్లు అల్ట్రా సైక్లింగ్‌ స్పోర్ట్‌ను పూర్తిచేశాడు. వాతావరణానికి, వణ్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు, హానీ కలిగించకుండా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎటువంటి కాలుష్యం చేయకుండా ఇన్ని ప్రాం తాలను చుట్టిరావడం గొప్ప అనుభూతిగా ఉన్నట్లు నరేందర్‌రెడ్డి పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో 1400 కిలోమీటర్ల ఫీట్‌ను సాధించడమే లక్ష్యంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు. జీవితకాలాన్ని పెంచుకునేందుకు కాకుండా ప్రతిరోజును జీవితానికి అందించేందుకు తాను సైకిళ్‌ను తొక్కుతున్నట్లు చెప్పుకొచ్చారు. 

logo