మంగళవారం 31 మార్చి 2020
Wanaparthy - Mar 05, 2020 , 02:14:52

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభంవనపర్తి విద్యావిభాగం:  జిల్లా వ్యాప్తంగా బుధవారం ఇంటర్‌ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్ష లు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 8262మంది విద్యార్థులకు గాను 7967 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరుకాగా 300మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షకు గంట ముందుగానే పరీక్షల కేంద్రాలకు చేరుకొని నోటీస్‌ బో ర్డుపై వేసిన హాల్‌టికెట్‌ నంబర్లను చూసుకున్నా రు. పరీక్ష 9:00 గంటలకు ప్రారంభమైనప్పటికీ గంట ముందుగానే పరీక్ష హాల్‌లోకి విద్యార్థులను అనుమతించారు. జిల్లావ్యాప్తంగా 24 కేంద్రాలలో పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకనే హాల్‌లోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్‌ కేంద్రాలను మూసివేయించి కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను ఏర్పాటు చేసి పటిష్ఠ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు.

 

పరీక్ష కేంద్రాలలో సౌకర్యాలను పరిశీలించిన కలెక్టర్‌ 

వనపర్తి, నమస్తే తెలంగాణ : ఇంటర్‌ పరీక్ష కేం ద్రాలలో ఓఆర్‌ఎస్‌ ద్రావణంతో పాటు ప్రథమ చి కిత్స ఏర్పాట్లను చేయాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాష ఆదేశించారు. బుధవారం ఆమె పట్టణంలో ని స్కాలర్స్‌, సీవీ రామన్‌ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సౌకర్యాలను, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె  పరీక్షల సందర్బంగా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా చూసుకోవాలని ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లా నుంచి మొత్తం 15269 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని, ఇందుకు గాను 24పరీక్ష కేం ద్రాలను ఏర్పాటు చేయగా, 24 మంది డిపార్ట్‌మెంట్‌ అధికారులు, 13మంది అదనపు ఛీప్‌ సూ పరిండెంట్లు, ఒక ైప్లెయింగ్‌ స్కాడ్‌ 2 సిట్టింగ్‌ స్కాడ్‌, 460మంది ఇన్విజిలేటర్లును నియమించామన్నారు. మొదటి రోజు పరీక్షలకు 7967 మంది విద్యార్థులు హాజరు కాగా 300 మంది విద్యార్థులు గైహాజరయ్యారు. 


logo
>>>>>>