సోమవారం 06 ఏప్రిల్ 2020
Wanaparthy - Mar 05, 2020 , 02:11:06

మురుగు కాల్వలను శుభ్రం చేయాలి

మురుగు కాల్వలను శుభ్రం చేయాలి

వనపర్తి, నమస్తే తెలంగాణ : వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న 10రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రధాన రహదారులతో పాటు చిన్న చిన్న వీధుల రోడ్లు, మురుగు కాల్వలు అన్నింటిని శుభ్రం చేయాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా ఆదేశించారు. బుధవారం ఆమె వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో గల నందిహిల్స్‌ పార్కులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పదిరోజుల కార్యాచరణలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో ప్రధానంగా మురుగు కాల్వలు శుభ్రపరచడం, ఖాళీ స్థలాలలో చెత్త, పిచ్చి మొక్కలు తొలగించడం, రోడ్లపై ఉన్నటు వంటి గుంతలను పూడ్చడం, ప్లాస్టిక్‌ వాడకం నిషేదించుటకు అవగాహన కల్పించడం , హరితహారమునకు సంబంధించి ప్రతి గృహంలో చెట్లు పెంచడం. అవసరమైన చోట వీధి దీపాలను ఏర్పాటు చేయడం, కూలిపోయిన భవనాలకు సంబంధించిన మట్టిని యజమాని అనుమతితో తొలగించడం, ఇంటి వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువును తయారు చేయడం వంటి ప్రధాన 8 అంశాలతో ఈ కార్యచరణను కొనసాగిస్తున్న ట్లు ఆమె తెలిపారు. 


అంతకుముందు జిల్లా కేంద్రంలోని 24వ వార్డులో గల అతి పురాతనమైన బండారు బా విని మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌ , ఆర్డీవో చంద్రారెడ్డితో కలిసి పూడ్చివేత కార్యక్రమాన్ని నిర్వహించి, ప క్కన గల ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు నాణ్యవంతమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అదేవిదంగా 1వ వార్డులో పు రాతన ఇండ్లను వార్డు కౌన్సిలర్‌ కాగితాల లక్ష్మినారాయణతో కలిసి మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌ తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ము న్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌ రెడ్డి, వనపర్తి తాసిల్దార్‌ రాజేందర్‌గౌడ్‌, ఆయా వార్డుల కౌన్సిలర్లు, ప్రత్యేకాధికారులు వార్డు ప్రజలు తదితరులు ఉన్నారు. 


logo