శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Wanaparthy - Mar 04, 2020 , 03:39:24

విస్తృతంగా మొక్కలు నాటండి

విస్తృతంగా మొక్కలు నాటండి
  • బడ్జెట్‌లో 10 శాతం నిధుల కేటాయింపు
  • పట్టణ ప్రగతిలో అలసత్వం వహిస్తే చర్యలు
  • వనపర్తిలో పబ్లిక్‌ టాయిలెట్లకు 13 స్థలాల గుర్తింపు
  • వనపర్తి, పెబ్బేరు మెగా ప్లాంటేషన్‌లో హాజరైన కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా
  • తడి, పొడి చెత్త సేకరణ వాహనాల ప్రారంభం
  • ఆత్మకూరులో అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ హాజరు

వనపర్తి, నమస్తే తెలంగాణ : పట్టణాలు, గ్రా మాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని, ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా మున్సిపల్‌ చెత్తబండిలోనే వేయాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా సూచించారు. పట్టణప్రగతిలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని మర్రికుంట ఎకోపార్కు వద్ద మెగా ప్లాంటేషన్‌లో పాల్గొని మున్సిపాలిటీ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటిశ్రీధర్‌, కౌన్సిలర్లతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ఐదు బల్దియాల్లో చైర్మన్లు, కౌన్సిలర్లు, అధికారులతో కలిసి మెగా ప్లాంటేషన్‌లో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలను నాటినట్లు చెప్పారు. ముఖ్యమైన చోట మొ క్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ప్రణాళిక ప్రకారం ప్రాధాన్యతా క్రమం లో పనులను చేపడుతున్నామని, బడ్జెట్‌లో 10 శాతం నిధులు హరిత ప్రణాళికకు కేటాయించి నర్సరీల పెంపకం, మొక్కలు నాటడం వంటివి చేయాలన్నారు. వనపర్తిలో పబ్లిక్‌ టాయిలెట్ల ని ర్మాణానికి 13 ప్రాంతాలు, సమీకృత మార్కెట్‌, దహన వాటిక, మలశుద్ది కేంద్రం వంటి వాటికి స్థ లాలను గుర్తించామని, రానున్న మూడు నెలల్లో ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఇంటింటికీ చెత్తబుట్టలు ఇస్తామని, ప్రతి వీధికి చెత్త వాహనం వస్తుందన్నారు. ఏప్రిల్‌ 2 నుంచి టీఎస్‌-బీపాస్‌ ప్రారంభం కానున్నదని, దీ ని ద్వారా భవనాల నిర్మాణం, అనుమతులు పొం దవచ్చని తెలిపారు. అనంతరం చెత్త సేకరణ వా హనాలను కలెక్టర్‌ ప్రారంభించారు. కార్యక్రమం లో డీఎఫ్‌వో బాబ్జీరావు, ఆర్డీవో చంద్రారెడ్డి, తాసిల్దార్‌ రాజేందర్‌గౌడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌ రెడ్డి, కౌన్సిలర్లు భువనేశ్వరి, ఉన్నీసాబేగం, కృష్ణయ్య, చీర్లసత్యం, నాగన్నయాదవ్‌, నారాయ ణ, బాష్యానాయక్‌, జంపన్న, నాయకులు శ్యాం కుమార్‌, దేవన్ననాయుడు తదితరులున్నారు. 


అలసత్వం వహిస్తే చర్యలు

పెబ్బేరు : పట్టణ ప్రగతిలో గుర్తించిన సమస్యలను పరిష్కరించడంలో అలసత్వం వహిస్తే చర్య లు తీసుకుంటామని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా హెచ్చరించారు. పట్టణంలోని 3వ వార్డులో ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌ కరుణశ్రీతో కలిసి మొక్కలు నా టారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఫి బ్రవరికి సంబంధించి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు రూ.123.99 లక్షల నిధులను రాష్ట్ర ప్ర భుత్వం మంజూరు చేసిందని, ఇందులో పెబ్బేరు మున్సిపాలిటీకి రూ.17 లక్షల నిధులు వచ్చినట్లు వెల్లడించారు. నాటిన మొక్కలు చనిపోతే ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యత వహించాలన్నారు. మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు 10,315 మంది నిరక్షరాస్యులను గుర్తించామని, రాష్ట్ర ప్ర భుత్వ ఆ దేశాల మేరకు వీరిని అక్షరాస్యులుగా తీ ర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నా రు. మంచిగా పనిచేస్తున్న మున్సిపల్‌ సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంత రం ప్రభుత్వ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భో జనాన్ని పరిశీలించారు. పాఠశాల గదుల పక్కన ఉన్న మెట్లకింద చెత్తాచెదారంతో ఉండడంతో ఉ పాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రహరీకి అనుకొని ఉన్న డ్రైనేజీ చెత్తతో కూరుకుపోవడంతో అధికారులు, ప్రజాప్రతినిధులపై మండిపడ్డారు. అనంతరం కౌన్సిలర్‌ అక్కమ్మతో కలిసి సావిత్రీబాయి ఫూలే ఫొటోతో కూడిన పరీక్ష ప్యాడ్‌లను పదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేశారు. అలా గే మున్సిపాలిటీకి కేటాయించిన తడి, పొడి చెత్త సేకరణకు గాను మూడు వాహనాలను ప్రారంభించారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించాలని తాసిల్దార్‌ ఘాన్సీరాం నాయక్‌ను ఆ దేశించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చై ర్మన్‌ కర్రెస్వామి, జెడ్పీ సీఈవో నరసింహులు, జి ల్లా ఉపాధి కల్పన అధికారి అనిల్‌, మున్సిపల్‌ క మిషనర్‌ చలపతి, మున్సిపల్‌ మేనేజర్‌ రమేశ్‌నాయక్‌, కౌన్సిలర్లు చిన్న ఎల్లారెడ్డి, రామకృష్ణ, పా ర్వతి, పద్మ, అశ్విని, సుమతి, సువర్ణ, గోపి బా బు, ఎల్లస్వామి, నాయకులు సాయినాథ్‌, ఎల్ల య్య, వెంకట్రాములు, సత్యం తదితరులున్నారు.


పర్యావరణ సమతుల్యతను కాపాడాలి

కొత్తకోట : మొక్కలను నాటి సంరక్షించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని జె డ్పీ వైస్‌ చైర్మన్‌ వామన్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్మ న్‌ సుకేశిని పేర్కొన్నారు. కొత్తకోటలోని 6వ వార్డులో ఉన్న పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ప్ర ధాన రహదారి వెంట అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ మౌనిక, సీడీసీ చైర్మన్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జ యమ్మ, తాసిల్దార్‌ రమేశ్‌రెడ్డి, మున్సిపల్‌ క మిషనర్‌ కతలప్ప,  కౌన్సిలర్లు సంధ్య, పద్మమ్మ, మహేశ్వరి, రామ్మోహన్‌రెడ్డి, నారాయణమ్మ, భరత్‌భూషన్‌, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్‌, ఎంపీటీసీ రంగారెడ్డి, నాయకులుబాలనారాయణ, బాలకృ ష్ణ, అయ్యన్న, సుభాశ్‌, పెంటన్న, హనుమంతుయాదవ్‌, వినోద్‌సాగర్‌, రవికుమార్‌, అంజి, వి కాస్‌, వసీంఖాన్‌, వాహిద్‌ తదితరులున్నారు. 


పర్యావరణాన్ని పరిరక్షించాలి : ఏసీ వేణుగోపాల్‌

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : మొక్కలు నా టి పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒ క్కరిపై ఉందని అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ పే ర్కొన్నారు. ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీల్లో మెగా ప్లాంటేషన్‌లో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏసీ మాట్లాడుతూ ఏపుగా పెరిగిన పెద్ద పెద్ద మొక్కలు నాటడం సం తోషంగా ఉందన్నారు. తదనంతరం పట్టణ ప్రగతిలో జరిగిన పనులు, చేపట్టాల్సిన ప్రణాళిక తదితరవాటిపై ఆరాతీశారు. చేపడుతున్న పనులను పర్యవేక్షించారు. ఆత్మకూరులో నూతనంగా ఏ ర్పాటు చేస్తున్న విద్యుత్‌ స్తంభాలు, విద్యుద్దీపా లు, రోడ్ల విస్తరణ, చెత్త తొలగింపు తదితర వా టిని పరిశీలించారు. అమరచింతలోనూ జేసీబీతో చేపడుతున్న ప నులను పర్యవేక్షించారు. ఆయా కార్యక్రమాల్లో ఆత్మకూరు, అమరచింత చైర్‌పర్సన్లు గాయిత్రీయాదవ్‌, మంగమ్మగౌడ్‌, వైస్‌ చైర్మ న్లు విజయభాస్కర్‌రెడ్డి, జీఎస్‌ గో పి, కమిషనర్లు కృష్ణయ్య, మో హన్‌, కౌన్సిలర్లు మహేశ్వరి, తబస్సుమ్‌బేగం, నాగలక్ష్మి, యాద మ్మ, పోషన్న, చెన్నయ్య, రామకృష్ణ, అశ్విన్‌కుమార్‌, లక్ష్మి, లావణ్య, విజయరాములు, సిం ధు, రాజ్‌కుమార్‌, మాధవి, ఉషారాణి, రాజశేఖర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రవికుమార్‌యాదవ్‌, సీఐ సీతయ్య, ఎస్‌ఐ ముత్తయ్య, ఫా రెస్ట్‌ అధికారి రాణి, అధికారులు పాల్గొన్నారు. 


logo