బుధవారం 08 ఏప్రిల్ 2020
Wanaparthy - Mar 04, 2020 , 03:33:13

మాస్‌కాపీయింగ్‌కు పాల్పడితే క్రిమినల్‌ కేసులు

మాస్‌కాపీయింగ్‌కు పాల్పడితే  క్రిమినల్‌ కేసులు
  • ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
  • నిమిషం నిబంధన యథాతథం
  • హాజరు కానున్న 15,269 మంది
  • ‘నమస్తే తెలంగాణ’తో డీఐఈవో సింహయ్య

‘ఇంటర్‌ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. సెంటర్ల వద్ద 144 సెక్షన్‌ విధిస్తున్నాం. 15,269 మంది విద్యార్థులు ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు రాయనున్నారు. 24 కేంద్రాలకు గాను పరీక్షల నిర్వహణకు 24 మంది సీఎస్‌లు, 24 మంది డీఓలను నియమించాం. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలుతో పాటు సమీపంలోని జిరాక్స్‌ కేంద్రాలను మూసివేసేలా చర్యలు చేపట్టాం. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష కొనసాతుంది. నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోం.’ అని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి సింహయ్య ‘నమస్తే తెలంగాణ’తో  వెల్లడించారు.      - వనపర్తి  విద్యావిభాగం

వనపర్తి విద్యావిభాగం : జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి సింహయ్య అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అనంతరం ఆయన నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. 


నమస్తే తెలంగాణ : జిల్లావ్యాప్తంగా ఎంత మంది విద్యార్థులు హాజరవుతున్నారు.?

   డీఐఈవో : జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌ ప్రథమ సం వత్సరానికి 8036, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 7233 మంది విద్యార్థులు మొత్తం 15,269 మంది విద్చార్థులు హాజరుకానున్నారు.


పరీక్ష కేంద్రాలు ఎన్ని, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి.?

జిల్లావ్యాప్తంగా 24 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 24 మంది చీప్‌ సూపరింటెండెంట్‌లు, 24 మంది డిపార్ట్‌మెంట్‌ అధికారులను నియమించాం. పరీక్షల పర్యవేక్షణ కోసం ఒక ప్లయింగ్‌ స్కాడ్‌, రెండు సిట్టింగ్‌ స్కాడ్స్‌ను నియమించడం జరిగింది. 


పరీక్ష కేంద్రాల వద్ద చర్యలు ఎలా ఉన్నాయి.?

   పరీక్ష కేంద్రాల వద్ద పోలీసుల సహకారంతో బం దోబస్త్‌ను ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. పరీక్ష కేం ద్రా ల సమీపంలో 144 సెక్షన్‌ అమలు, జీరాక్స్‌ కేంద్రాలను మూసివేసేలా చర్యలు చేపట్టాం.


పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇచ్చే సూచనలు ఎంటి.?

   విద్యార్థులు సెల్‌ఫోన్‌, క్యాలిక్యులేటర్స్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకురావద్దు. పరీక్ష కేంద్రాలకు 8 గంటల లోపు చేరుకోవాలని, 9 గంటల తరువాత పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని, ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉందని, ఎట్టి పరిస్థితుల్లో గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకునేలా ఏర్పాటు చేసుకోవాలి. 


పరీక్ష కేంద్రాల వద్ద వసతులు ఎలా ఉన్నాయి.?

    పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు తాగునీరు, బెంచీలు, వేసవి కాలం కావడంతో డిహైడ్రేషన్‌ కాకుండా సకాలంలో వైద్య సిబ్బంది సేవలు అందించేందుకు జిల్లా హెల్త్‌ అధికారులతో మాట్లాడి నర్సులు, ఏఎన్‌ఎంల, ఆశాలను పరీక్షల కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచేలా చూడాలని కోరామన్నారు.


ఆర్టీసీ సహకారం ఎలా.?

ఆర్టీసీ అధికారులకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సూచనలు ఉన్నాయి. జిల్లాలో తమ హాల్‌టికెట్లను చూయిం చి విద్యార్థులు ఉచితంగా ప్రయాణించేందుకు ఆర్టీసీ డీఎంతో మాట్లాడాం. ఈ బస్సుపాసులు విద్యార్థుల యొక్క నివాస ప్రదేశం నుంచి పరీక్ష కేంద్రం వరకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఈనెల 4 నుంచి 23వ తేదీ వరకు వర్థిస్తుంది.


పరీక్ష సమయం.?

   ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష కొనసాగుతుంది. పరీక్ష సమయం పూర్తయ్యాకనే హాల్‌ నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. 


పరీక్ష కేంద్రాల వివరాలు.?

   మొత్తం పరీక్ష కేంద్రాలు 24 కాగా అందులో 11 ప్రభుత్వ పరీక్ష కేంద్రాలు, 13 ప్రైవేట్‌ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఎలాంటి మాస్‌కాపింగ్‌ కాని అలజడులు జరిగిన చీప్‌ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు బాధ్యులు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. logo