గురువారం 02 ఏప్రిల్ 2020
Wanaparthy - Mar 02, 2020 , 23:35:18

పెట్రోల్‌బంకుల్లో సౌకర్యాలు కల్పించాలి

పెట్రోల్‌బంకుల్లో సౌకర్యాలు కల్పించాలి

వనపర్తి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని అన్ని పెట్రోల్‌బంకుల్లో వినియోగదారులకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో పౌరసరఫరాల అధికారులు, పెట్రోల్‌ బంకుల యజమానులు, ఐవోసీ, హెచ్‌పీసీ, బీపీసీ సేల్స్‌ అధికారులతో కలెక్టర్‌ సమావేశా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని పెట్రోల్‌ బంక్‌లలో పురుషులు, స్త్రీలకు వేర్వేగా మరుగుదొడ్లను నిర్మించాలని, సరైన వెలుతురు వచ్చేలా లైట్లను ఏ ర్పాటు చేయాలని, నీటి వసతి, చెత్తకుండీల ఏర్పాటు, మొక్కలు నాటడం, పెట్రోల్‌ బంకుల నుంచి వెలువడే నీటిని మురుగు కాలువల్లోకి మళ్లించడం వంటివి చేయాలన్నా రు. సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే తగు చర్యలను తీసుకుంటామన్నారు. పెట్రోల్‌బంక్‌ల యజమానులు వెంటనే రెన్యువల్‌ చేయించుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని పె ట్రోల్‌ బంక్‌ల వివరాలతో కూడిన డేటాబేస్‌ను రూపొందించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రేవతిని ఆదేశించారు. సమావేశానికి లీగల్‌ మెట్రాలజీ అధికారి సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు


logo
>>>>>>