బుధవారం 01 ఏప్రిల్ 2020
Wanaparthy - Mar 02, 2020 , 00:08:30

పుష్కలంగా.. సాగునీరు

పుష్కలంగా.. సాగునీరు

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : భీమా ఎత్తిపోతల పథకంలోని శంకరసముద్రం రిజర్వాయర్‌ నుంచి నీటి విడుదలకు సిద్ధమైంది. అయి తే, పునరావాసంలో భాగంగా కొత్తకోట మండలంలోని కానాయపల్లి గ్రామం ఖాళీ చేయకపోవడంతో శంకరసముద్రం కుడి కాలువకు నీరందే పరిస్థితి లేదు. రిజర్వాయర్‌ పూర్తి స్థాయిలో నిండితేనే కుడి కాలువకు నీరందే పరిస్థితి ఉన్నది. దీం తో పదేళ్లుగా కానాయపల్లి పునరావాస సమస్య కొలిక్కి రాకపోవడంతో ప్రత్యామ్నాయాల ద్వారా రైతులు కాలువకు నీటిని తరలించి సాగు చేసుకుంటున్నారు. మూడేళ్ల కిందట వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డిల కృషితో టీఎస్‌ఐడీసీ మోటర్లను ఏర్పాటు చేసి శంకరసముద్రం కుడి కాలువ కు నీటి విడుదల చేశారు. అయితే, పాత మోటర్లు కావడంతో తరుచూ మరమ్మతులకు గురవుతున్నాయి. దీంతో రైతులు ప్రత్యామ్నాయాలను ఏ ర్పాటు చేసుకున్నారు.

ఉదారత్వం చాటిన నాయకులు..

రైతులకు సాగునీటిని అందించేందుకు నాయకులు లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చి ఉదారత్వం చాటుకున్నారు. కొత్తకోట ఎంపీపీ గుంత మౌనిక దాదాపు రూ.6 లక్షలను కనిమెట్ట గ్రామానికి విరాళంగా ఇచ్చి ఐదు మోటర్లను పంపిణీ చే శారు. అలాగే పెద్దమందడి మండలం మోజర్లకు చెందిన ఎం.సత్యారెడ్డి, కే.సత్యారెడ్డిలు రూ.1.25 లక్షల చొప్పున రూ.2.50 లక్షలతో రెండు మోటర్లను ఇచ్చారు. అలాగే రైతులు సైతం ఒక్కొక్కరు రూ.10 వేల నుండి రూ.20 వేల వరకు చందాలు పోగు చేసుకుని మొత్తం రూ.6.25 లక్షలతో ఐదు మోటర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఇలా మొత్తం 12 మోటర్ల ద్వారా శంకరసముద్రం రిజర్వాయర్‌ కుడి కాలువ నుంచి నీటిని ఎత్తిపోసుకుంటున్నా రు. నాయకులు దాదాపు రూ.9 లక్షలను విరాళం గా అందించారు. 

ఐదు గ్రామాలకు సాగునీరు..

శంకరసముద్రం రిజర్వాయర్‌ కుడి కాలువ నుంచి ఐదు గ్రామాలకు సాగునీరందుతున్నది. ఈ ఏడాదిలో వానాకాలంలో దాదాపు 4 వేల ఎకరాల్లో పంటలు పండించుకున్నారు. ఇప్పుడు యాసంగిలో మరో 2,500 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఉగాది పండుగ లోగా యాసంగి చే లన్నీ చేతికి వచ్చే అవకాశం ఉన్నది. పాలెం, నిర్వి న్‌, కనిమెట్ట, మోజర్ల, రామానంతపురం గ్రామాలకు శంకరసముద్రం రిజర్వాయర్‌ కుడి కాలువ నుంచి మోటర్ల ద్వారా సాగునీరందుతుంది. రెండేళ్లకు పైగా టీఎస్‌ఐడీసీ నుంచి మోటర్లను ఏర్పాటు చేసి ఈ కాలువకు నీళ్లు అందించారు. ఆ మోటర్లు తరుచూ మొరాయించడంతో రైతులు ఇతర ప్ర త్యామ్నాయాల వైపు చూడాల్సి వచ్చింది.


ఆరెకరాలు సాగు చేశా..

శంకరసముద్రం రిజర్వాయర్‌ కుడి కాలువకు ప్రత్యేకంగా మోటర్లు ఏర్పాటు చేసి నీటి విడుదల చేయడంతో తమకు మేలు జరుగుతున్నది. వర్షాలు అంతంత మాత్రంగా ఉన్నప్పుడు ఈ కాలువ నీళ్లు మమ్మల్ని బతికిస్తున్నాయి. ఎంపీపీ గుంతమౌనిక చొరవతో ఐదు మోటర్లు ఏర్పాటు చేసుకున్నాం. దీంతో మాకు ఈ ఏడాది వానాకాలంతో పాటు యాసంగిలోనూ పంటలు సాగు చేసుకునేందుకు వీలైంది. ఇప్పుడు కూడా నేను 6 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాను. నెల రోజుల్లో పంట చేతికి వస్తుంది.      - ప్రతాప్‌ రెడ్డి, రైతు, కనిమెట్ట


సహకారం మరువలేనిది.. 

నాయకులు అందించిన సహకారం మరువలేనిది. ఎన్నికలప్పుడు నాయకులు అనేక వాగ్దానాలు చేసి మరిచిపోతారు. అయితే, రైతులకు సాగునీరందించేందుకు తోడ్పాటునిస్తామన్న హామీని అమలు చేయడం మంచి పరిణామం. రైతులకు సహాయం చేసిన వారిని ఎల్లకాలం గుర్తుంచుకుంటం. బోర్లు ఉన్నప్పటికీ శంకరసముద్రం రిజర్వాయర్‌ నీళ్లు లేకుంటే చాలా కష్టం. ఈ నీటితో పంటలను సంతోషంగా పండించుకుంటున్నాం.

   - భీంరెడ్డి, రైతు, కనిమెట్ట 


logo
>>>>>>