శనివారం 04 ఏప్రిల్ 2020
Wanaparthy - Mar 01, 2020 , 00:25:59

తొలిసారి తీర్పు ఏకపక్షం

తొలిసారి తీర్పు ఏకపక్షం

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సహకార సంఘాల చరిత్రలో తొలిసారి రాష్ట్రంలోని అన్ని డీసీసీబీలు, డీసీఎంస్‌లు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఇదే తొలిసారని వ్యవసాయశాఖ మంత్రి ఎస్‌ నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతుల సంక్షేమానికి డీసీసీబీ, డీసీఎంఎస్‌ల ద్వారా కృషి చేస్తామని ఆయన తెలిపారు. రైతులంతా పూర్తి ఏకపక్షంగా తీర్పునిచ్చారన్నారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాల ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీ బండ ప్రకాశ్‌, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, కొత్తగా ఎంపికైన పాలకవర్గ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 19 లక్షల రైతులు సహకార సంఘాల్లో సభ్యులు ఉన్నారని, అంతా సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఏకపక్షంగా తీర్పునిచ్చారన్నారు. 


రాష్ట్రంలోని అన్ని డీసీసీబీ, డీసీఎంస్‌లు ఏకగ్రీవం కావడం, అవన్నీ టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుతో పోటీ చేసిన వారే స్వాధీనం చేసుకోవడం ఓ రికార్డు అని అన్నారు. రైతు ప్రభుత్వం అయిన టీఆర్‌ఎస్‌పై రైతులకు ఉన్న అభిమానానికి ఈ ఎన్నికలు నిదర్శనమన్నారు. వ్యవసాయం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోందన్నారు. సహకార వ్యవస్థకు చేదోడువాదోడుగా ఉండేందుకు అనేక సంస్కరణలు తీసుకొస్తామన్నారు. సహకార సంఘాల ద్వారా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, మార్కెటింగ్‌, పంట కొనుగోళ్లు చేపడతామన్నారు. సీఎం కేసీఆర్‌ సైతం సొసైటీ చైర్మన్‌గానే రాజకీయ ఆరంగేట్రం చేశారని గుర్తు చేశారు. సహకార సంఘాల వ్యవస్థ బలోపేతం చేసేందుకు రైతులకు సేవలందించేందుకు కొత్త పాలకవర్గాలు కృషి చేయాలని కోరారు. 


logo