మంగళవారం 31 మార్చి 2020
Wanaparthy - Mar 01, 2020 , 00:22:01

పక్కా ప్రణాళికతో పరీక్షలు నిర్వహించండి

పక్కా ప్రణాళికతో పరీక్షలు నిర్వహించండి

వనపర్తి విద్యావిభాగం : పరీక్షల నిర్వహకులు ప్రణాళిక ప్రకారం పదో తరగతి ప రీక్షలను నిర్వహించాలని డీ ఈవో సుశీందర్‌రావు పేర్కొన్నారు. శనివారం జిల్లా కేం ద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో డిపార్ట్‌మెంట్‌ అధికారులు, చీఫ్‌ సూపరింటెండెంట్‌లకు పదో తరగతి పరీక్షల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ మా డ్యుల్‌లో ఇచ్చిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివి నిబంధనల ప్రకారం పరీక్షలు సజావుగా సాగేలా చూడాలన్నారు. పరీక్ష హాల్‌లోకి ఎలాంటి పరిస్థితుల్లో సెల్‌ఫోన్‌లను అనుమతించరాదని సూచించారు. పత్రిక, పోలీసులు, స్వంత అటెండర్‌, క్లర్క్‌లను ఏర్పాటు చేసుకోవడానికి అనుమంతించొద్దన్నారు. విద్యార్థులకు ప్రశ్నాపత్రం ఇవ్వగానే హాల్‌ టికెట్‌ నంబర్లు తప్పనిసరిగా వేసేలా చూడాలన్నారు. మాస్‌ కాపీయింగ్‌ను ఉపేక్షించేది లేదని, చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులదే బాధ్యత అని అన్నారు. ప్రతిరోజూ రేడియో సందేశాన్ని అనుసరించాలని, జిల్లావ్యాప్తంగా 35 కేంద్రాల్లో 34 రెగ్యులర్‌, ఒకటి ప్రైవేట్‌ వి ద్యార్థులకు కేంద్రాలను ఏ ర్పాటు చేశామన్నారు. 


పరీక్షల నిర్వహణకు 35 మంది డిపార్ట్‌మెంట్‌ అధికారులు, 35 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, ఆరుగురు అ డిషనల్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు, రెండు ఫ్లయింగ్‌ స్కాడ్స్‌ టీమ్‌లు ఉంటాయన్నారు. ఒక్కో టీమ్‌లో ఎం ఈవో, తాసిల్దార్‌ ఉంటారని, నలుగురు రూట్‌ ఆఫీసర్స్‌తో పాటు 421 మంది ఇన్విజిలేటర్లతో సర్వం సిద్ధం చేశామన్నా రు. జిల్లావ్యాప్తంగా 7,941 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారన్నారు. ప్రతి కేంద్రం లో సిట్టింగ్‌, ఫ్లయింగ్‌ స్కాడ్స్‌ను ఏర్పాటు చేశామని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షలు సజావుగా నిర్వహించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరీక్షల విభాగాధిపతి జీఎం ఎం మధుకర్‌, నోడల్‌ అధికారిణి వరలక్ష్మీ, అన్ని పాఠశాలల హెచ్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు. logo
>>>>>>