శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 29, 2020 , 01:42:30

లబ్ధిదారులకు మేలు జరుగాలి

లబ్ధిదారులకు మేలు జరుగాలి

వనపర్తి, నమస్తే తెలంగాణ : టీఎస్‌ఐఎస్‌, టీ ఫ్రిడ్‌, ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్‌ గ్యారెంటీ ప్రోగ్రాం వంటి పథకాల కింద ఎక్కువ మంది లబ్ధిదారులకు మేలు కలిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన టీఎస్‌ఐఎస్‌, టీఫ్రిడ్‌, పీఎంఈజీపీ పథకాలపై నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తులలో ఏదైనా కారణం చేత దరఖాస్తును తిరస్కరించవల్సి వస్తే అందుకు గల కారణాన్ని స్పష్టం గా పేర్కొనాలన్నారు. అంతేకాక విషయాన్ని ఫైలులో నివేదిక రూపంలో ఉంచాలని ఆదేశించారు. టీఎస్‌ఐపాస్‌ కింద ఇప్పటి వరకు 156 దరఖాస్తులు రాగా 150 దరఖాస్తులను కమిటీ అనుమితించిందని, ఐదు దరఖాస్తులు వివిధ కారణాల వల్ల తిరస్కరించడం జరిగిందని, ఒక దరఖాస్తు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులో పెండింగ్‌లో ఉందని తెలిపారు. 


టీఫ్రిడ్‌ కింద ఔత్సాహికులకిచే ప్రోత్సాహకంలో భాగంగా షెడ్యూల్డ్‌ కులాల వారికి ఇప్పటివరకు ఏడు యూనిట్లకు 18,95,298 రూపాయల సబ్సిడీని, షెడ్యూల్డ్‌ తెగల వారికి ఐదు యూనిట్లకు రూ.13,41,021 ల సబ్సిడీ ఇచ్చినట్లు కలెక్టర్‌ తెలిపారు. టీఎస్‌ఐపాస్‌ కమిటీలో ఉన్న శాఖల అధికారులు తప్పనిసరిగా వారి శాఖకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల వివరాలు అనుమతులు, అన్ని విషయాలను తెలుసుకోవాలని కోరారు. టీఎస్‌ఐపాస్‌ కమిటీలో ఉన్న ఆయా శాఖల అధికారులు తప్పనిసరిగా వారి శాఖకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల వివరాలు, అనుమతులు, అన్ని విషయాలను తెలుసుకోవాలని కోరారు. జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీల వివరాలను చిరునామాలతో సహా, ఫోన్‌ నెంబర్లు సమర్పించాలని ఆదేశించారు. అలాగే జిల్లాకు సంబంధించి డీటీసీపీ అనుమతి పొందిన లే అవుట్ల జాబితాను సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశానికి జిల్లా పరిశ్రమల అధికారి నరేశ్‌కుమార్‌, సంబంధిత జిల్లా శాఖ అధికారులు హాజరయ్యారు. 


logo