గురువారం 02 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 29, 2020 , 01:38:38

సమస్యల పరిష్కారానికి నాంది ‘పట్టణ ప్రగతి’

సమస్యల పరిష్కారానికి నాంది ‘పట్టణ ప్రగతి’

పెబ్బేరు రూరల్‌ : రహదారికి ఇరువైపుల మొక్కలు నాటాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అన్నారు. శుక్రవారం పెబ్బేరు మండలంలోని కంచిరావుపల్లిలో నర్సరీని సందర్శించారు. పెద్దమొక్కలను వెంటనే తరలించి నాటాలని అన్నారు. అనంతరం పెబ్బేరు పట్టణప్రగతి కార్యక్రమాన్ని పరిశీలించారు. మార్చి 3న హరితహారంలో జిల్లాలో మెగా ప్లాంటేషన్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొనాలని సూచించారు. జిల్లాలోని ముఖ్యపట్టణాల్లో మెగా ప్లాంటేషన్‌ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి రోగులకు సరైన సౌకర్యాలు కల్పించాలని డీఎంహెచ్‌వో శ్రీనివాసులు ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌  కరుణశ్రీ, వైస్‌ చైర్మన్‌ కర్రెస్వామి, కమిషనర్‌ చలపతి, పలువురు వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. logo
>>>>>>