సోమవారం 06 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 27, 2020 , 23:05:16

సమస్యలకు శాశ్వత పరిష్కారం

సమస్యలకు శాశ్వత పరిష్కారం

కొత్తకోట : మున్సిపల్‌ కేంద్రంలో చేపడుతున్న పట్టణ ప్రగతిలో ఆయా వార్డులలో ఉన్న సమస్యలను గుర్తిం చి శాశ్వతంగా పరిష్కరించే దిశగా పనులు చేపట్టాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం కొత్తకోట మున్సిపల్‌ కేంద్రంలో చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే 9,10 వార్డులలో పరిశీలించారు. ముందుగా ప్రజాప్రతినిధు లు, అధికారులు వార్డుల్లో తిరుగుతూ మురుగు కాలువలను, మిషన్‌ భగీరథ పైపులైన్‌ పనులు, విద్యుత్‌ సమస్యలు, ప్లాస్టిక్‌ నిర్మూలన, చెత్త సేకరణ, హరితహారం వంటి పట్టణాభివృద్ధికి అవరోధంగా ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని అత్యంత ప్రాధాన్యత గల సమస్యలను వెంటనే గుర్తించి శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. మిషన్‌ భగీరథ పనులు త్వరగా పూర్తిచేసి పట్టణ ప్రజలకు తాగునీటిని అందించాలన్నారు. మున్సిపల్‌ అధికారులు, వార్డు కౌన్సిలర్లు ఎప్పటికప్పుడు తమ తమ వార్డులలోని సమస్యలను గుర్తించి నివేదికను తయా రు చేసి ఆ దిశగా అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పట్టణంలో కర్నూల్‌ వైపు ఉన్న ప్రధాన రహదారి విస్తరణ పనులను నాణ్యతగా చేపట్టాలని సూచించారు.   హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అందుకు ఎండకాలంలో మొక్కలను సంరక్షించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకోవాలన్నారు. ప్లాస్టిక్‌ నిర్మూలనపై పట్టణంలో దుకాణ యజమానులకు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగారు. 

కార్యక్రమంలో జిల్లా వైస్‌ చైర్మన్‌ జి.వామన్‌గౌడ్‌, ఎంపీపీ గుంతమౌనిక,  మున్సిపల్‌ చై ర్మన్‌ సుకేశిని, మున్సిపల్‌ కమిషనర్‌  కతలప్ప, మండ ల ప్రత్యేక అధికారి రఘుపతిరెడ్డి, తాసిల్దార్‌ రమేశ్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జయమ్మ,  మున్సిపల్‌ కౌన్సిలర్లు తిరుపతయ్య, ఖాజామొహినుద్దీన్‌, సంధ్యారాణి, హోటల్‌ రాముడు,  సర్పంచుల సంఘం మండల అ ధ్యక్షుడు ఆకుల శ్రీనివాసులు, మాజీ జెడ్పీటీసీలు విశ్వేశ్వర్‌, పీజే బాబు, విద్యార్థి విభాగం నాయకులు శ్రీనూ జి, సీడీసీ చైర్మన్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ సర్పంచులు సాక బాలనారాయణ, చెన్నకేశవరెడ్డి, సీనియర్‌ నాయకులు భీంరెడ్డి, అయ్యన్న, మిషేక్‌, సుభాష్‌ కొం డారెడ్డి, వినోద్‌సాగర్‌, సాజిద్‌, వహిద్‌, కృష్ణయ్యగౌడ్‌, కోటేశ్వర్‌రెడ్డి,  మున్సిపల్‌ సిబ్బంది, పార్టీ కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. logo