బుధవారం 08 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 27, 2020 , 23:04:29

పుష్కరాల వరకు భక్తులకు సౌకర్యాలు

పుష్కరాల వరకు భక్తులకు సౌకర్యాలు

అలంపూర్‌, నమస్తే తెలంగాణ : రాబోయో తుంగ భద్ర పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పుష్కరాలను పురష్కరించుకుని నదీ స్నానాలు, ఆలయ దర్శనాల కోసం వచ్చే భక్త యాత్రికులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు దేవాదాయ శాఖ స్థపతి వల్లీ నాయగం అన్నారు. ఆయన దేవాదాయ శాఖ ఇంజినీర్లతో కలిసి  గురువారం అలంపూర్‌ పట్టణంలో పర్యటించారు. ఆలయ పరిసరాలు, పట్టణంలో దేవాదాయ శాఖకు సంబంధించిన నేటి వరకు ప్రారంభానికి నోచుకోని  దేవాదాయ శాఖ అతిథి గృహంలో ఫర్నీచర్‌ ఏర్పాటు, ప్రహరీగోడ నిర్మాణం వంటి చేపట్టాల్సిన పనులు , పుష్కరఘాట్‌, ఆలయాల పరిసరాల ఫ్లోరింగ్‌, అమ్మ వారి ఆలయ రాజ గోపురానికి రంగులు వేయడం, తదితర ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించి పరిశీలించారు. తుంగభద్ర పుష్కరాలు వచ్చే ప్రాంతాల్లో రాష్ట్రంలో పేరేన్నిక కలిగిన క్షేత్రాల్లో  అలంపూరు మొదటిదని పుష్కరాల సందర్భంగా నదీ పుణ్య స్నానానికి వచ్చే భక్త యాత్రికులకు అవసర మయ్యే సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్ని స్తున్నట్టు వారు వివరించారు. ప్రసాదాల కోసం అదనపు కౌంటర్ల ఏర్పాటు, తయారీకి అవసరమయ్యే షెడ్‌ నిర్మాణం, పుష్కరఘాట్లో భక్తులకు నీడ కోసం వేయాల్సిన చలువ పందిళ్ళు, తాత్కాలిక సౌకర్యాలకు సంబంధించి అంచనాలు తయారు చేసేందుకు స్థల పరిశీలన, పురావస్తుశాఖ మ్యూజియం వద్ద గల పార్కింగ్‌ స్థలం నుంచి పుష్కరఘాట్‌ వరకు  లైటింగ్‌ ఏర్పాటు చేశారు. వారితో పాటు అసిస్టెంట్‌ స్థపతి దామోదర్‌, ఈఈ మల్లిఖార్జున్‌రెడ్డి, ఏఈ బాలయ్య, ఆలయ ఈవో ప్రేమ్‌కుమార్‌, ఆలయ సిబ్బంది ఆలయ ముఖ్య అర్చకుడు ఆనంద్‌ శర్మ తదితరులు ఉన్నారు. మరో సందర్భంలో ల్యాండ్‌ ప్రొటెక్షన్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రమాదేవి ఆలయాలను దర్శించుకున్నారు. దేవాదాయ భూముల పరిశీలనకు వచ్చిన సందర్భంలో ఆమె అలంపూరు జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. అనంతరం స్థపతి వల్లి నాయగం తదితరులు కలిసి చర్చించారు.logo