శనివారం 04 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 28, 2020 , T01:10

వ్యర్థాలను రహదారి పక్కన వేస్తే.. చర్యలు తప్పవు

వ్యర్థాలను రహదారి పక్కన వేస్తే.. చర్యలు తప్పవు

వనపర్తి,నమస్తే తెలంగాణ : హోటళ్లు, కిరాణా షాపు లు, ఇతర వాణిజ్య సంస్థల నుంచి వెలువడే వ్యర్థాలను పట్టణం వెలుపల రహదారుల పక్కన పారవేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా హెచ్చరించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు, మర్రికుంట ఎకో పార్కు పరిసర ప్రాంతాలను సందర్శించారు. ముందుగా 9వ వార్డులో ఒక షాపు ముందు మున్సిపాలిటీ కాల్వపై స్లాబు వేసినందున మురుగునీరు ముందుకు వెళ్లకుం డా నిలిచిపోవడంతో ఆర్డీవో చంద్రారెడ్డి, మున్సిపల్‌ క మిషనర్లు మహేశ్వర్‌రెడ్డిలు అక్కడికి వెళ్లి మురికి కాల్వను పరిశుభ్రం చేయించే పనులు చేపట్టగా వాటిని కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ ఎవరైనా మురి కి కాలువలో చెత్తా చెదా రం, ప్లాస్టిక్‌ కవర్లు వేస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారికి నోటీసులు జారీ చేయాలని హెచ్చరించారు. పక్కనే ఉన్న భవానీ ఫిల్లింగ్‌ స్టేషన్‌లో టాయిలెట్లు లేకపోవడంతో వెంటనే నిబంధనల ప్రకారం నోటీసు జారీ చేయాలన్నా రు. జిల్లాలోని అన్ని పెట్రో ల్‌ బంక్‌లను పరిశీలించి  టాయిలెట్లు లేనివారికి నోటీసులు జారి చేయాలని, ఈ మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులకు తెలియజేయాలని ఆర్డీవోను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర ఎకో పార్కు వద్ద రహదారి పరిశుభ్రత కార్యక్రమాన్ని పరిశీలించారు. వనపర్తి - పెబ్బేర్‌ రహదారిపై తిరుమలయ్య గుట్ట నుంచి వనపర్తి టౌన్‌ వరకు రోడ్డుకి ఇరువైపులా హరితహారం కింద మొక్కలు నాటించాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, కౌన్సిలర్‌ భాష్యనాయక్‌, ఆర్డివో చంద్రారెడ్డి, తాసిల్దార్‌ రాజేందర్‌గౌడ్‌, ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ దేశ నాయక్‌ తదితరులు ఉన్నారు. 


logo