ఆదివారం 24 మే 2020
Wanaparthy - Feb 26, 2020 , 01:17:28

నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించం

నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించం

కొత్తకోట : నూతన మున్సిపల్‌ చ ట్టం ప్రకారం నిర్లక్ష్యం వహిస్తే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని, మున్సిపాలిటీల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్ట ణ ప్రగతిని విజయవంతం చేసేందు కు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా పేర్కొన్నా రు. మంగళవారం కొత్తకోటలోని 14వ వార్డులో జరుగుతున్న పట్టణ ప్రగతి పనులను జెడ్పీ వైస్‌ చైర్మన్‌ వామన్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ సు కేశినిలతో కలిసి పరిశీలించారు. డ్రైనేజీలు, మొక్కలు, తాగునీటి వసతులు, పబ్లిక్‌ టాయిలెట్స్‌, చెత్త సేకరణ వంటి అంశాలను పరిశీలించి వార్డుల్లోని సమస్యలను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం అం గన్‌వాడీ కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. అదనపు శ్రామికులతో ప ట్టణంలోని అన్ని డ్రైనేజీలను శుభ్రపరచాలన్నారు. స్వచ్ఛసర్వేక్షణ్‌ సర్వే ప్రకారం జనాభాకు అనుగుణంగా పారిశుధ్య వసతులు కల్పించబడతాయన్నారు. హరితహారంలో నాటిన మొక్కలను 85 శాతం సంరక్షించేలా చూడాలన్నారు. మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి అనుమతులకు గాను సింగిల్‌విండో ద్వారా పారదర్శకంగా అనుమతులు ఇస్తుందని, అక్రమాలకు పాల్పడితే శిక్షలు, జరిమానలు తప్పవని హెచ్చరించారు. ఆదర్శ మున్సిపల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. వార్డు అ భివృద్ధి కమిటీలో యువత, మహిళలను భాగస్వాములను చేయాలన్నారు. పట్టణ ప్రగతిలో ప్రధానంగా రోడ్ల నిర్మాణం, శ్మశాన వాటిక ఏర్పాటు, ఏకీకృత మార్కెట్‌ నిర్మాణం, డంపింగ్‌యార్డు, పబ్లిక్‌ టాయిలెట్లకు స్థలా ల కేటాయింపు వంటి అంశాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. చెత్త సేకరణ, సకాలంలో పన్ను చెల్లింపు, హరితహారం మొక్కల సంరక్షణ వంటి అంశాలపై ప్రజలు సహకరించాలన్నారు. వార్డు అభివృద్ధి క మిటీల సూచనలు, సలహాలు ఎజెండాలో చేర్చాలని చె ప్పారు. రానున్న మూడు నెలల్లో ప్రణాళిక పూర్తయ్యే లా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్‌ను మున్సిపల్‌ చైర్మన్‌ సుకేశిని, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధు లు శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమం లో ప్రత్యేక అధికారి రఘుపతిరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ కతలప్ప, తాసిల్దార్‌ రమేశ్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చై ర్మన్‌ జయమ్మ, సీడీసీ చైర్మన్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఉ మ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్‌, కౌన్సిలర్లు సంధ్యారాణి, పద్మ, ఖాజమోహినుద్దిన్‌, మాజీ జెడ్పీటీ సీ విశ్వేశ్వర్‌, మాజీ సర్పంచులు బాలనారాయణ, చెన్నకేశవరెడ్డి, సీనియర్‌ నాయకులు భీంరెడ్డి, బాబురెడ్డి, ప్రే మయ్య, అయ్యన్న, రవీందర్‌రెడ్డి, బాలకృష్ణ, సుభాశ్‌, కొండారెడ్డి, శ్రీనూజీ, వినోద్‌సాగర్‌, సాజిద్‌, వహిద్‌,  వార్డు ఇంచార్జి పర్యవేక్షకులు, ఆయా వార్డుల ప్రత్యేక అధికారులు, మున్సిపల్‌ సిబ్బంది తదితరులున్నారు. 

బాధ్యతగా మొక్కల సంరక్షణ చేపట్టాలి

మదనాపురం : మొక్కలు సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా చేపట్టాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా సూచించారు. మంగళవారం మండలంలోని దంతనూ రు గ్రామాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముం దుగా గ్రామ శివారులోని నర్సరీని పరిశీలించి, మొక్కల పెంపకం సరిగ్గా లేదని కిందిస్థాయి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మొక్కల పెంపకంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం గ్రామంలోని పలు వీధుల్లో తిరిగారు. చెత్తాచెదారాన్ని వెంటనే తొలగించాలని పంచాయతీ సెక్రటరీ విక్రమ్‌గౌడ్‌కు, మురుగు కాల్వలు శుభ్రం చేయాలని సర్పంచ్‌ శ్రావణికి సూచించారు. పల్లెప్రగతిపై అలసత్వం వహించరాదని, నిరంతరం గ్రామ అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేయాలన్నారు. రహదారులకు ఇరువైపులా పెద్దపెద్ద మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. మళ్లీ గ్రా మాన్ని సందర్శిస్తానని, అప్పటివరకు పరిశుభ్రంగా మా ర్చాలని, ఎక్కడా అపరిశుభ్ర వాతావరణం కనిపించకూడదన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో గణేశ్‌, ఎం పీవో పుష్ప, తాసిల్దార్‌ సింధూజ, సీనియర్‌ అసిస్టెంట్‌ గౌస్‌, ఏపీవో రాములు, టీఏ రాము, వీఆర్వో చంద్రశేఖర్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ లక్ష్మి, వైస్‌ ఎంపీపీ యాదమ్మ, టీఆర్‌ఎస్‌ మండల ప్రచార కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


logo