బుధవారం 08 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 26, 2020 , 01:03:55

మొక్కలు నాటి సంరక్షించాలి

మొక్కలు నాటి సంరక్షించాలి

వనపర్తి విద్యావిభాగం: మానవులు ప్రకృతిని వినా శనం చేయడంతోనే పర్యావ రణంలో అసమ తుల్యతలు ఏర్పడుతున్నాయని ప్రొఫెసర్‌ పుల్లయ్య అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో అసోసియేషన్‌ బయోడైవర్సిటీ కన్సర్వేషన్‌ ఆండ్‌ డెవలప్‌మెంట్‌ ప్రభుత్వ మహిళ డిగ్రీకళాశాల సంయుక్త ఆధ్వర్యంలో జీవ వైవిధ్య సంరక్షణపై వాతా వరణ మార్పు ప్రభావం అనే ఆంశంపై జా తీయ సెమినార్‌ నిర్వహించారు. ఈసెమి నార్‌కు ప్రొఫెసర్‌ పుల్లయ్య, నిర్మల బాబారావు హాజరై మాట్లాడుతూ..  ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను చేపట్టి, భవిష్యత్‌ తరాలకు బాటలు వేద్దామని అన్నారు. అనంతరం నిర్వహించిన ఫొటో ఎక్జిబిషన్‌లో ప్రథమ బహుమతి పొందిన బెస్ట్‌ పోస్టర్‌ ప్రజెంటేషన్‌ చేసిన ఎస్వీఎమ్మాఆర్‌ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ సురేశ్‌, ప్రొఫెసర్‌ సదాశి వయ్య, అధ్యాపకులు శరత్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు. logo