శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 25, 2020 , 01:21:24

పట్టణ ప్రగతికీ శ్రీకారం

పట్టణ ప్రగతికీ  శ్రీకారం

వనపర్తి, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో సాంఘీ క మార్పునకు రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతితో శ్రీకారం చుట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి సిం గిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఐదో వార్డులో ఎంపీ రాములు, కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషాలతో కలిసి మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ పర్యావరణం, పారిశుధ్యం, పచ్చదనంపై ప్రజల్లో బాధ్యత పెంచాలన్న ఉద్దేశంతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను అమలుచేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ సంస్థలు పారదర్శకంగా పనిచేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ నెల 24 నుంచి మార్చి 4వ తేదీ వరకు పట్టణ ప్రగతిని నిర్వహిస్తున్నామని, ఇది నిరంతర ప్రక్రి య అని అన్నారు. వార్డు కమిటీలు, ప్రత్యేక అధికారి, కౌన్సిలర్లు అందరూ వార్డుల్లో తిరిగి సమస్యలను గుర్తించి తక్షణం, భవిష్యత్తులో పరిష్కరించే వాటిని విభజించాలన్నారు. బల్దియాల్లో పనులను చేపట్టేందుకు మున్సిపల్‌ నిధులు విడుదల చేస్తుందని, వనపర్తి మున్సిపాలిటీకి ప్రతి నెలా రూ.62 లక్షలను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. వాటితో పాటు ప్రభుత్వం ఇచ్చే నిధులతో దీర్ఘకాలికంగా ఉపయోగపడే వాటిని నిర్మించుకోవాలని సూచించారు. 


ప్రస్తుతం పీర్లగుట్ట సమీపంలో ఒకటే శ్మశా న వాటిక ఉందని, ప్రజలందరికీ ఇది అనువుగా లేనందున కాశీంనగర్‌, చిట్యాల, గోపాల్‌పేట రో డ్లలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి శ్మశాన, దహన వాటికల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధునాతన సౌకర్యాల తో మార్కెట్లను ఏర్పాటు చేయనున్నామని, ప్రత్యేకించి ప్రసుత్తం ఉన్న మార్కెట్‌ యార్డ్‌ స్థలంలో రూ.15 కోట్ల వ్యయంతో సమీకృత మార్కెట్‌ నిర్మిస్తామని, ఏకో పార్కు సమీపంలో దారి వెంట మార్కెట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు చె ప్పారు. పారిశుధ్యంతో పాటు హరితహారం కింద మొక్కలు పెంచేందుకు కౌన్సిలర్లు, మున్సిపల్‌ సి బ్బంది ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని, సీసీ రో డ్లపై గుంతలు తవ్వి మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. నాటిన మొక్కల్లో తప్పనిసరిగా 85 శాతం బతికించాలని, లేకుంటే కౌన్సిలర్‌ పదవి పోతుందని హెచ్చరించారు. మున్సిపాలిటీ పరిధి లో ఇండ్లు నిర్మించుకునేందుకు 75 గజాల వరకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, నామమాత్రంగా ఒక రూపాయి చెల్లించి ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అక్రమంగా కట్టడాలను నిర్మిస్తే కొత్త మున్సిపాలిటీ చట్టం ప్రకారం చర్యలు కఠినంగా ఉంటాయని వెల్లడించారు. పట్ట ణ ప్రగతిలో భాగంగా నిరక్షరాస్యులను గుర్తించి వారికి చదువు చెప్పిస్తామని వెల్లడించారు. ఎవ్వ రూ ప్లాస్టిక్‌ కవర్లు, బ్యాగులు వినియోగించొద్దని, దుకాణ యజమానులు ప్లాస్టిక్‌ కవర్లలో సామాన్లు ఇస్తే తిరస్కరించాలని, బట్ట సంచుల్లో మాత్రమే ఇవ్వాలని అడగాలన్నారు. తన వంతుగా నా పెద్ద కూతురు డాక్టర్‌ ప్రత్యూష 2 వేల బట్ట బ్యాగులను పంపించిందని, వాటిని వార్డుకు కొన్ని చొప్పున పంపిణీ చేస్తామని, ఇందులో భాగంగా ఐదో వార్డులో 150 బ్యాగులను అందజేశామన్నారు.


పల్లె ప్రగతి స్ఫూర్తితో : ఎంపీ రాములు 

పల్లెప్రగతి కా ర్యక్రమంతో పల్లెలన్నీ సుందరం గా మారాయని, పట్టణాలను సై తం అలా మా ర్చాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌ పట్టణ ప్రగతిని ప్రారంభించినట్లు ఎంపీ రాములు వివరించారు. పట్టణప్రగతితో బల్దియాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. ప్రజలు, అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 


logo