శనివారం 04 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 23, 2020 , 23:20:37

తోడ్పాటునిస్తున్న వైద్య శిబిరాలు

తోడ్పాటునిస్తున్న వైద్య శిబిరాలు

కొత్తకోట : పేదల ఆరోగ్యానికి వైద్య శిబిరాలు ఎంతో తోడ్పాటునిస్తాయని వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపల్‌ కేంద్రంలోని నివేదిత కాన్సెప్ట్‌ స్కూల్‌ లో సొసైటీ ఫర్‌ హెల్త్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ డెవలప్‌మెంట్‌ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, సా మాజికవేత్త ఎస్‌ఆర్‌.ప్రేమయ్య ఆధ్వర్యంలో ఉచి త మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. యశో ద సూపర్‌ స్పెషాలిటీ సికింద్రాబాద్‌, ఉస్మానియా దంత వైద్యశాల హైదరాబాద్‌, సాయిజ్యోతి చికి త్స కంటి వైద్యశాల సికింద్రాబాద్‌ వారి సౌజన్యం తో ఏర్పాటు చేసిన శిబిరాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మంద జగన్నాథంతో కలిసి జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి న సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తున్నప్పటికీ ఇలాంటి వైద్య శిబిరాలతో ప్రజలు తమ ఆరోగ్య పరిస్థితులను పరీక్షించుకుంటారన్నారు. గుర్తింపు ఉన్న దవాఖాన డాక్టర్లు వైద్యం అందించడం సంతోషించదగ్గ విషయమన్నారు. ప్రజలకు మంచి ఆరోగ్యం అందించాలనే సంకల్పంతో వై ద్య శిబిరాలు నిర్వహించేందుకు ముందుకు వచ్చి న ప్రేమయ్యకు అభినందనలు తెలిపారు. అనంతరం మంద జగన్నాథం మాట్లాడుతూ వైద్య శిబిరాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడు ఉం టుందని అన్నారు. 30 ఏండ్ల నుంచి స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రేమయ్య ఉమ్మడి పాలమూరు జి ల్లాలో ఎన్నో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి స్ఫూ ర్తిగా నిలిచారన్నారు. 


సేంద్రియ ఫలాలను కొనుగోలు చేసిన మంత్రి

సేంద్రియ ఎరువులతో పండించిన పండ్లు, కూ రగాయాలు, నూనెలను రైతు రవీందర్‌ వైద్య శిబిరంలోని ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రదర్శన వద్దకు వెళ్లి పండ్ల ను కొనుగోలు చేశారు. సేంద్రియ వ్యవసాయ గొ ప్పతనాన్ని నాయకులకు వివరించారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన పంటలలో ప్రో టీన్స్‌, విటమిన్స్‌ ఉండడం మూలంగా రోగాలకు దూరంగా ఉండవచ్చని సూచించారు. యువ రైతు రవీందర్‌ను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహిత, ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు సాయిబాబాగౌడ్‌, డెంటల్‌ సర్జన్‌ గవర్నర్‌ ఆఫ్‌ తెలంగాణ ఎంఎస్‌ గౌడ్‌, ప్రభుత్వ డెంటల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ శాంతకుమారి, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ జి.వామన్‌గౌడ్‌, ఎంపీపీ మౌ నిక, మున్సిపల్‌ చైర్మన్‌ సుకేశిని, వైస్‌ చైర్మన్‌ జయ మ్మ, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్‌, మండల ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, హనుమంతుయాదవ్‌, వినోద్‌సాగర్‌, సింగిల్‌ విండో డైరెక్ట ర్లు, కౌన్సిలర్లు, పాఠశాల కరస్పాండెంట్‌ లక్ష్మీవెంకటయ్య, ప్రిన్సిపల్‌ అశోక్‌, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. logo