మంగళవారం 31 మార్చి 2020
Wanaparthy - Feb 22, 2020 , 01:39:43

శాశ్వత పరిష్కార దిశగా..

శాశ్వత పరిష్కార దిశగా..

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : గ్రామాలు.. పట్టణాల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం కృషి చేస్తున్నది. ఈ మేరకు ప్రజా ప్రతినిధు లు, అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ కార్యాచరణ రూపొందించి పనులు జరిపిస్తున్నారు. గత ఏడాది ప్రభుత్వం తీసుకొచ్చిన పల్లెప్రగతి తొలి విడుత సెప్టెంబరు 6వ తేదీ నుంచి 30 రోజులు, రెండో విడుత ఈ ఏడాది జనవరి 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగింది. పల్లె ప్రగతి కార్యక్ర మం ఇప్పటి వరకు గ్రామాల్లోని దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి మార్గదర్శకంగా నిలిచిన క్ర మంలో పట్టణాలకు వేదికగా నిలవబోతుంది. ప ల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల స్వరూ పం మారుతున్నది. ప్రతి గ్రామానికి డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటిక, నర్సరీల ఏర్పాటు, పారిశుధ్యం నిర్వహణను ప్రధానంగా తీసుకున్నారు. ఆరు నెలల కిందట ప్రారంభమైన ఈ కార్యక్ర మం పల్లెలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. దాదా పు మెజార్టీ గ్రామాల్లో ప్రధాన సమస్యలు కొలిక్కి వస్తున్నాయి. జరిగిన పనుల స్ఫూర్తితో మరింత బాధ్యతగా నిర్వహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఈ క్రమంలోనే పంచాయతీ సమ్మేళనాలను నిర్వహించి ప్రజాప్రతినిధులకు, అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. 


కొత్త చట్టంపై అవగాహన

కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం-2018పై ప్రజా ప్రతినిధులకు, అధికారులకు పూర్తిస్థాయిలో వివరించే ప్రయత్నం జరుగుతుంది. ఎన్నికలకు ముందే పంచాయతీరాజ్‌ చట్టాన్ని మా ర్పు చేశారు. ఇక రాష్ట్రంలో గ్రా మ పంచాయతీలకు ఎన్నికలు పూర్తి కావడం.. కొత్త సర్పంచులు కొలువుదీరడంతో కొత్త చట్టం పై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగిన అనంతరం కొత్త సర్పంచులకు మూడు రోజులపాటు శిక్షణ ఇప్పించారు. ఇందులో ప్రత్యేకంగా పంచాయతీ రాజ్‌ కొత్త చట్టంపై సర్పంచులకు అవగాహన కల్పి స్తూ.. విధులు.. బాధ్యతలపైన వివరించారు. చేపట్టాల్సిన పనులు, నిధుల దుర్వినియోగాలపై ప్రత్యేకంగా ఈ శిక్షణలో కొత్త సర్పంచులకు అవగాహన కల్పించారు. వీటిపై అవగాహన కల్పిస్తూనే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేసింది.


గ్రామ సమస్యల పరిష్కారం దిశగా..

గ్రామ పంచాయతీల్లో జవాబుదారితనం పెరగడంతో పల్లె ప్రగతి గ్రామాల్లో పురోగతిని సాధిస్తుంది. దీని అనంతరం వచ్చిన పల్లె ప్రగతిని సర్పంచులు గ్రామాల అభివృద్ధికి మలుచుకున్నారు. పారిశుధ్యం, వీధిలైట్లు, శ్మశాన వాటికలు, డంపింగ్‌ వార్డుల ఏర్పాటులాంటివి పల్లె ప్రగతిలో కొలిక్కి వచ్చాయి. జీపీలకు కొత్త ట్రాక్టర్లు రావడంతో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలకు నీరు పోసేందుకు, పారిశుధ్య పనులకు ఉపయోగపడుతున్నాయి.


పల్లె ప్రగతి స్ఫూర్తిగా..

పల్లె ప్రగతి స్ఫూర్తిగా పట్టణ ప్రగతికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీని కోసం మున్సిపాలిటీల్లో నాలుగు రోజుల కిందట సన్నాహాలు మొదలయ్యాయి. వార్డుల వారీగా వివిధ కమిటీల్లో ప్రజ ల భాగస్వామ్యం కల్పించేందుకు గుర్తింపు కార్యక్రమం చేపడుతున్నారు. ఇటీవల కొత్త పాలకవర్గాలు కొలువుతీరడం, వారికి నేరుగా సీఎం కేసీఆర్‌ దిశా.. నిర్దేశం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనంతరం బల్దియాల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై మున్సిపల్‌ అధికారులు దృష్టి పెట్టారు. ఈనెల 24వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు బల్దియాల్లో పట్టణ ప్రగతిని నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూర్‌, అమరచింత మున్సిపాలిటీల వారీగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారయంత్రాం గం సన్నద్ధమైంది.


పట్టణాలకు మహర్దశ

పల్లె ప్రగతి స్ఫూర్తిగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం బల్ధియాలకు మహర్దశను అందించనుంది. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు పట్టణ ప్రగతిని నిర్వహించేందుకు ప్రభుత్వ అధికారులు కార్యాచరణ రూపొందించే పనులకు శ్రీకారం చుట్టారు. పట్టణాల్లోనూ పారిశుధ్యం, అంతర్గత రహదారులు, విద్యుత్‌ సమస్యలు, డంపింగ్‌ యార్డులు, మరుగుదొడ్లు, తడి, పొడి చెత్త సేకరణలాంటివన్ని పట్టణాల్లో ప్రధానంగా కనిపిస్తా యి. అయితే, కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో అన్ని కొత్తగానే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. యంత్రాలు ఏర్పాటు చేసుకోవడం.. అందుకు తగ్గట్టుగా సిబ్బందిని నియమించుకునే వెసలుబా టు ఉన్నందునా పాత, కొత్త మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి పురోగతి సాధిస్తుందని విశ్వసిస్తున్నారు. పట్టణాల్లో ఉన్న సమస్యలకు పట్టణ ప్రగ తి కార్యక్రమం శాశ్విత పరిష్కారం చూయించేదిగా నిలుస్తుందని భావిస్తుండగా, అభివృద్ధి పనులతో బల్దియాలకు కొత్త రూపం రాబోతుంది. 
logo
>>>>>>