శనివారం 28 మార్చి 2020
Wanaparthy - Feb 22, 2020 , 01:37:42

తీర్చిదిద్దుతాం

తీర్చిదిద్దుతాం

అచ్చంపేట రూరల్‌ : శ్రీశైల ఉత్తర ధ్వారమైన శ్రీ ఉమామహేశ్వర క్షేత్రాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని పార్లమెంట్‌ సభ్యులు రాములు అన్నారు. ఎంపీ కి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. మహా శివరాత్రి సందర్భంగా శుక్రవారం ఉమామహేశ్వర క్షేత్రంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శైవ క్షేత్రాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజుతో కలిసి ఈ క్షేత్రాన్ని పర్యాటక హాబ్‌గా చేస్తామని భరోసానిచ్చారు. దేవస్థాన ప్రాంగనం భక్తులతో కిటకిట లాడింది. అనంతరం దేవస్థాన చైర్మన్‌ సుధాకర్‌, ఆలయ కార్యనిర్వాహణ అధికారి శ్రీనివాస్‌రావులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా పల్కపల్లి సమీపంలోని రామలింగేశ్వర ఆలయంలో, భక్త మార్కండేయ శివాలయంలో శివరాత్రి వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ శాంతా లోక్యానాయక్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ మనోహర్‌ ఉన్నారు.


logo