శనివారం 04 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 21, 2020 , 02:35:55

అభివృద్ధి చెందిన దేశాల సరసన తెలంగాణ నిలబడాలి

అభివృద్ధి చెందిన దేశాల సరసన  తెలంగాణ నిలబడాలి

అభివృద్ధి చెంది న దేశాల సరసన తెలంగాణ రాష్ర్టాన్ని నిలపాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ వివిధ పథకాలను అమలు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు

  • సమస్యలపై యుద్ధం చేయాలి
  • భావితరాలకు బాటలు వేయాలి
  • పట్టణ ప్రగతిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి
  • పంచాయతీరాజ్‌ సమ్మేళనంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
  • హాజరైన ఎంపీ పోతుగంటి, ఎమ్మెల్యే ఆల, కలెక్టర్‌ యాస్మిన్‌ బాష

వనపర్తి ప్రతినిధి,నమస్తే తెలంగాణ : అభివృద్ధి చెంది న దేశాల సరసన తెలంగాణ రాష్ర్టాన్ని నిలపాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ వివిధ పథకాలను అమలు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, జపా న్‌, జర్మనిలాంటి వన్నీ గతంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కున్నవేనని మంత్రి పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో దాచలక్ష్మయ్య ఫంక్షన్‌ హాల్లో ‘పంచాయతీ రాజ్‌ సమ్మేళనం-పట్టణ ప్రగతి’పై ప్రత్యే క కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నిరంజన్‌రెడ్డితో పాటు ఎంపీ పోతుగంటి రాములు, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాష హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమెరికాకు 500 ఏళ్ల చరిత్ర మాత్రమే ఉందని, నేడు అన్నింటా అమెరికా ముందు వరసలో నిలిచిందన్నారు. 5 వేల సంవత్సరాల చరిత్ర కలిగిన సింధూ నాగరికత పరిధిలోని మన ప్రాంతం ఇప్పటికీ మరుగుడొడ్ల, మురికికాలువల నిర్మాణం, డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాల ఏర్పాటుపై ఇప్పుడు దృష్టి పెట్టాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందో ఒక్కసారి ఆలోచించాలని మంత్రి కోరారు. నాడు వెనకబడ్డ దేశాలు నేడు ముందు వరసలో నిలిచాయని, అందుకు అక్కడి ప్రజల చైతన్యం, అవగాహనతో ఉండటమేనన్నారు. దాదాపు 35 ఏళ్లపాటు అంతర్గత యుద్ధంతో సతమతమైన శ్రీలంక దేశానికి ఇతర దేశాల నుంచి టూరిస్టులు వస్తున్నారంటే జరిగిన మార్పులను గమనించాలన్నారు.


వనరులు, సౌకర్యాలు లేని దేశాలు నేడు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని, వాటిని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో నెంబర్‌ వన్‌గా నిలపాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో సీఎం ముందుంటారని, వాటిని ఆచరణ చేసి చూయించడంలోను సీఎంకు సాటెవరు లేరన్నారు. రాకెట్‌ సైన్స్‌లో పితామహుడిగా పేరొందిన, మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ అబ్దుల్‌ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి చెప్పారు. పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలగాలని, శాశ్వత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ కార్యాచరణకు పూనుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమస్యలపై యుద్ధం చేయాలని, దీర్ఘకాలిక ప్రయోజనాలకు అనుగుణంగా వచ్చే పది రోజుల్లో సమస్యలను గుర్తించాలని మంత్రి చెప్పారు. వనపర్తిలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ ఏర్పాటుకు ప్రయత్నం జరుగుతుందని, ఏకోపార్క్‌ను అనుసరించి రైతు మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. మున్సిపల్‌ వ్యవస్థలో పని చేస్తున్న వారందరిని నిద్రావస్థ నుంచి మేల్కొల్పాలని, ఈ ఐదేళ్లు క్రియాశీలకంగా పని చేయాలని నూతన మున్సిపల్‌ పాలకవర్గాలకు మంత్రి పిలుపునిచ్చారు.


పల్లె ప్రగతిని పార్లమెంట్‌ మెచ్చుకున్నది : ఎంపీ పోతుగంటి రాములు

ఇటీవల రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ రెండు విడుతలుగా అమలు చేసిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పార్లమెంట్‌లోని ఎంపీలంతా ప్రశంసించారని ఎంపీ పోతుగంటి రా ములు పేర్కొన్నారు. గ్రామ స్వరాజ్యం రావాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతతో పని చేయాలన్నారు. దేశంలో ప్రధాని, ముఖ్యమంత్రి, సర్పంచు పదవులకు ముఖ్య భూమిక ఉందన్నారు. పట్టణ ప్రగతి ద్వారా శాశ్వత ప్రయోజనం పొందేలా మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు కార్యాచరణ రూపొందించుకోవాలని ఎంపీ చెప్పారు.


 చట్టంపై అవగాహన పెంచుకోవాలి: ఎమ్మెల్యే ఆల 

పంచాయతీరాజ్‌ నూతన చట్టంపై సర్పంచులు, ము న్సిపల్‌ చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు అవగాహన పెంచకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి చెప్పారు. ఈ చట్టం ద్వారా నేడు అధికారుల కం టే అధిక బాధ్యతలు ప్రజా ప్రతినిధులకు ఉన్నాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా దారి చూపినట్లవుతుందన్నారు. 


అభివృద్ధికి బాటలు : జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి

రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాటలు వేస్తున్నారని జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగానే అనేక పథకాలను అమ లు చేస్తున్నారన్నారు. నేడు ప్రతి కార్యక్రమానికి జవాబుదారీ తనం పెరిగిందని, ఇందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు బాధ్యత నిర్వహించా ల్సి ఉంటుందన్నారు ప్రభుత్వ ఒత్తిడివల్ల హరితహారంను బాధ్యతగా తీసుకుంటున్నారని, ఇంకా అన్ని కార్యక్రమాల్లోను ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. 


మోడల్‌ మున్సిపాల్టీలుగా నిలవాలి : కలెక్టర్‌ యాస్మిన్‌ బాష

జిల్లాలోని ఐదు మున్సిపాల్టీలు పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా మోడల్‌ మున్సిపాల్టీలుగా గుర్తింపు పొందాలని కలెక్టర్‌ యాస్మిన్‌ బాష పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం పట్టణ ప్రగతికి పునాది పడిందని, ఇటీవల రెండు విడుతల్లో  చేపట్టిన పల్లె ప్రగతి పథకంలో అభివృద్ధిలో కేవలం ఒక్క అడుగు మాత్రమే ముందుకు పడిందన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొ నసాగాలన్నారు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 4 వరకు పట్టణ ప్రగతిలో సమస్యల అజెండాను సిద్ధం చేయాలని కలెక్టర్‌ చెప్పారు. సమావేశానికి జెడ్పీ సీఈవో నరసింహులు అధ్యక్షత వహించగా, జిల్లా అదనపు కలెక్టర్‌ డీ వేణుగోపాల్‌, డీఆర్‌డీవో గణేశ్‌, డీఏవో సుధాకర్‌ రెడ్డి, మార్కెటింగ్‌ ఏడీ సువర్ణ సింగ్‌, పీఆర్‌ ఈఈ శివకుమార్‌, డీపీవో రాజేశ్వరి, మున్సిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌, ఎంపీపీలు కిచ్చారెడ్డి, గుంత మౌనిక, పానుగంటి కమలేశ్వరావ్‌, క్రిష్ణా నాయక్‌, జెడ్పీటీసీలు భార్గవి, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ వామన్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


అమరుడు యాదయ్యకు నివాళి

తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుడైన నల్లగొండ జిల్లా మహేశ్వరం గ్రామానికి చెందిన సిరిపురం యాదయ్య వర్ధంతి సందర్భంగా సమ్మేళన సభ నివాళి అర్పించింది. యాదయ్య తెలంగాణ కోసం ఇదే రోజున అమరుడయ్యాడని మంత్రి తెలిపారు. సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. 


logo