సోమవారం 30 మార్చి 2020
Wanaparthy - Feb 19, 2020 , 00:37:46

అర్హులందరికీ.. డబుల్‌ఇండ్లు

అర్హులందరికీ.. డబుల్‌ఇండ్లు

అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి భరోసా ఇచ్చారు.. మంగళవారం ఖిల్లాఘణపురం, రేవల్లి మండలాల్లో నిర్మించిన 92 డబుల్‌బెడ్‌రూం ఇండ్లను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.

  • పేదవాళ్లు ఆలస్యమైందని అధైర్యపడొద్దు
  • వరుస క్రమంలో ఇండ్ల పంపిణీ
  • స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
  • ‘పక్కా’గా పనిచేస్తాం : మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
  • ఖిల్లాఘణపురం, రేవల్లిలో 92 డబుల్‌బెడ్‌రూం గృహాల్లోకి ప్రవేశాలు
  • వనపర్తి, పాన్‌గల్‌లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం

అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి భరోసా ఇచ్చారు.. మంగళవారం ఖిల్లాఘణపురం, రేవల్లి మండలాల్లో నిర్మించిన 92 డబుల్‌బెడ్‌రూం ఇండ్లను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్‌, రెండు పార్కులను ప్రారంభించారు.. పాన్‌గల్‌ మండలంలోని కొత్తపల్లి స్టేజీ వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాలను ఆదుకుంటూ దేశంలోనే నంబర్‌వన్‌ రాష్ట్రంగా నిలిపారన్నారు. గూడు లేని ప్రతి పేదవాడి కల  సాకారం చేసేందుకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు చేపట్టి పంపిణీ చేస్తున్నామన్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ మాయమాటలు చెప్పకుండా పక్కాగా పనిచేస్తామని చెప్పారు.. నియోజవర్గంలో ఇండ్లు నిర్మించేందుకు స్థలాలు ఎంపిక చేస్తుంటే ఓర్వలేని ఆంధ్రా పార్టీల నాయకులు కోర్టులో కేసులు వేసి ఆలస్యం చేస్తున్నారన్నారు. ఇందుకు ఎవ్వరూ అధైర్యపడొద్దని, ఎట్టి పరిస్థితుల్లో అర్హులందరికీ ఇండ్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే వానాకాలం నాటికి కర్నెతండా లిఫ్ట్‌ ద్వారా ఐదువేల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు.. 


ఖిల్లాఘణపురం : దేశంలో ఎక్కడా లేని విధం గా తెలంగాణ రాష్ట్రంలో గూడు లేని పేదవాడికి ఉ చితంగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి పంపి ణీ చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని ఈర్లతండా, కర్నెతండాలలో నిర్మించిన 67 డబుల్‌ బెడ్‌రూం ఇం డ్లను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ముందుగా వారి కి గిరిజన మహిళలు బతుకమ్మలు, నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం లబ్ధిదారులకు ఇండ్ల తాళాలను పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా స్పీకర్‌ పోచారం మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోతే ఆంధ్రా నాయకులు తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతుందని అన్నారని, అందు కు భిన్నంగా సీఎం కేసీఆర్‌ ప్రమాణస్వీకారం నా టి నుంచి నేటి వరకు నిరంతరం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల కోసం పనిచేస్తున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపె ట్టి అండగా నిలుస్తూ దేశంలోనే మొదటిస్థానంలో నిలిపారన్నారు. 


పేదవాడికి ఇళ్లు ఎంత ముఖ్యమో గుర్తించిన సీఎం కేసీఆర్‌ నిరుపేద కుటుంబాలకు ఇళ్లు కట్టించాలనే సంకల్పంతో ప్రతి గ్రామంలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే ప్రతిపక్ష నాయకులు కోర్టులలో కేసులు వేస్తూ అడ్డు తగులుతున్నారన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రికార్డు సమయంలో ఖిల్లాఘణపురం మండలాన్ని సాగునీటితో సస్యశ్యామలం చేసిన ఘనత నిరంజన్‌రెడ్డికే దక్కిందన్నారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓటమి చెం దినా పట్టువీడని విక్రమార్కుడిలా సీఎం కేసీఆర్‌ను ఒప్పించి మెప్పించి కృష్ణానీరు తీసుకువచ్చి రైతుల పాదాలు కడిగిన నిరంజన్‌రెడ్డి సంకల్పం గొప్పదన్నారు. మండలంలో మిగిలిపోయిన గ్రామాలకు సాగునీరు తెచ్చేందుకు కర్నెతండా లిప్ట్‌ సాధనకు తన సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. 


మాయమాటలు చెప్పం : మంత్రి నిరంజన్‌రెడ్డి

మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేయకుండా పక్కగా పనిచేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ మాట తప్పకుండా, మడమ తిప్పకుండా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను అర్హులైన పేదవాడికి అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నియోజకవర్గంలో 1400 ఇండ్ల నిర్మాణా లు కొనసాగుతున్నాయని, మరో 1000 ఇండ్లకు సహకరించాలని స్పీకర్‌ను కోరారు. అందరికీ డ బుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు చేపడుతుంటే ప్ర తిపక్షాల కండ్లు మండి అడ్డుకుంటున్నారని, ఇండ్ల నిర్మాణాలు చేపట్టేందుకు స్థలాలు ఎంపిక చేస్తే కో ర్టులో కేసులు వేస్తున్నారన్నారు. ఇండ్ల నిర్మాణాలు పూర్తిగా వరుస క్రమంలో నిర్మించి అందిస్తామని, ఇప్పటికే ఆలస్యమైందని ఎవరూ అధైర్యపడొద్దన్నారు. కర్నెతండా లిఫ్ట్‌ ఏర్పాటుతో మిగిలిపోయి న గ్రామాలకు సాగునీరు అందుతుందన్నారు. వ చ్చే వానాకాలం నాటికి పనులు పూర్తిచేసి ఐదు వే ల ఎకరాలకు సాగునీరు అందిస్తానని చెప్పారు. సీ ఎం కేసీఆర్‌ చేస్తున్న పనులను ప్రజలు నమ్మి రా ష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్‌ఎస్‌ పక్షాన ప్ర జలు ఉన్నారని గుర్తుచేశారు. ఇటీవల జరిగిన ము న్సిపల్‌, సహకార ఎన్నికలే ఇందుకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణానాయక్‌, జె డ్పీటీసీ సామ్యనాయక్‌, సింగిల్‌విండో అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ క్యామరాజు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాళ్లకృష్ణయ్య, నాయకు లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, తం డా ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


చెన్నారంలో డబుల్‌బెడ్రూం ఇండ్ల ప్రారంభం

రేవల్లి : మండలంలోని చెన్నారం గ్రామంలో నిర్మించిన 25 డబుల్‌బెడ్‌రూం ఇండ్లను స్పీకర్‌ పోచారం, మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. ప్రత్యేక వాహనంలో చెన్నారం గ్రామానికి చేరుకున్న స్పీకర్‌, మంత్రి గ్రామ దారివెంట ఉన్న పచ్చని పంట పొలాలను పరిశీలించారు. గతంలో ఎడారులుగా దర్శనమిచ్చే పొలాలు ఎంజీకేఎల్‌ఐ నీటితో పచ్చగా కళకళలాడుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సేనాపతి, జెడ్పీటీసీ భీమయ్య, గోపాల్‌పేట సింగిల్‌విండో చైర్మన్‌ రఘుయాదవ్‌, జెడ్పీటీసీ భార్గవి, ఎంపీపీ తిరుపతయ్య, వైస్‌ ఎంపీపీలు మధుసూదన్‌రెడ్డి, శేఖర్‌, సర్పంచులు రమేశ్‌, సునిల్‌కుమార్‌, నరేందర్‌రెడ్డి, జ గదీశ్వర్‌, జ్యోతి, గోపాల్‌రావు, లక్ష్మి, శలేశ్వరం, ఎంపీటీసీలు వల్లమ్మ, కుర్మతిరెడ్డి, శ్రీశైలంయాదవ్‌, కో ఆప్షన్‌ మతీన్‌, నాయకులు రఘురామారావు, సురేందర్‌రెడ్డి, స్వామిరెడ్డి, అర్జున్‌రావు, శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.


logo