బుధవారం 01 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 19, 2020 , 00:36:21

ఇక.. బల్దియా‘ప్రగతి’

ఇక.. బల్దియా‘ప్రగతి’

మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ శ్రీకారం చుట్టింది.. పల్లెప్రగతి సత్ఫలితాలిస్తుండడంతో మరోసారి పట్టణప్రగతిని ప్రారంభించనున్నారు.. ఈ మేరకు మంగళవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లతో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు..

  • ఈ నెల 24వ తేదీ నుంచి అమలు
  • దిశానిర్దేశం చేసిన సీఎం కేసీఆర్‌
  • ప్రతి మున్సిపాలిటీకో ప్రత్యేక అధికారి
  • సమస్యలను గుర్తించే పనులకు శ్రీకారం

మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ శ్రీకారం చుట్టింది.. పల్లెప్రగతి సత్ఫలితాలిస్తుండడంతో మరోసారి పట్టణప్రగతిని ప్రారంభించనున్నారు.. ఈ మేరకు మంగళవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లతో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.. ఈ నెల 24వ తేదీ నుంచి ఆయా మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి ప్రారంభించాలని సూచించారు. ఐదు బల్దియాలకు ఐదుగురు ప్రత్యేకాధికారులను నియమించి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. 

- వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ


వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పల్లె ప్రగతి కా ర్యక్రమాన్ని విజయవంతం చేసిన సర్కార్‌ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సీఎం కేసీఆర్‌ తీసుకున్న చొరవ ఫలితంగా నేడు పల్లెల్లో అభివృద్ధి పనులు స్పష్ట ంగా కనిపిస్తున్నాయి. ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల.. అలాగే పక్కాగ పనుల నిర్వహణ బాధ్యతలతో నేడు పల్లె రూపురేఖలు మారుతున్నాయి. ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల సమరాన్ని ము గించుకుని నూతన ప్రజా ప్రతినిధులు కొత్త బాధ్యతలను స్వీకరించారు. పల్లె ప్రగతి స్ఫూర్తిగా మళ్లి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మున్సిపాలిటీల్లో అమలుకు ప్ర భుత్వం నిర్ణయించింది. 


ఈ మేరకు మంగళవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లతో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశా.. నిర్దేశం చేశారు. జిల్లాలో 255 గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతిని విజయవంతంగా నిర్వహించారు. గత ఏడాది సెప్టెంబరు 6 నుంచి అక్టోబరు 5 వరకు 30 రోజుల పాటు మొదటి విడతలో పల్లె ప్రగతిని ప్రారంభించి అమలు చేశారు. ప్రతి మనిషికి ఏడాదికి 1600 రూపాయలు చొప్పున ప్రతి నెలా గ్రా మ పంచాయతీలకు విడుదల చేస్తూ ప్రభుత్వం గ్రా మ పంచాయతీలకు తోడ్పాటునిచ్చింది. ఈ నూతన పథకం ద్వారా ప్రతి మూడు నెలలకు ఒకసారి చొప్పు న గ్రామాల్లోని సమస్యలను గుర్తించి పరిష్కారం చేసేలా ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల రెండో విడుత పల్లె ప్రగతిని కూడా గ్రామాల్లో నిర్వహించారు. వివిధ రకాల దీర్ఘకాలిక సమస్యలన్ని పల్లె ప్రగతిలో కొలిక్కి రావడంతో ఈ పథకం ప్రజల అభిమానాన్ని చూరగొన్నది.


పల్లె ప్రగతి స్ఫూర్తితోనే..

పల్లె ప్రగతి స్ఫూర్తితోనే నేడు సీఎం కేసీఆర్‌ పట్టణ ప్రగతి పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 24వ తేదీ నుంచి ఆయా మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. జిల్లాలో వనపర్తి, పెబ్బేరు, ఆత్మకూరు, కొత్తకోట, అమరచింత మున్సిపాలిటీలు ఉన్నాయి. పట్టణ ప్రగతికి సంబంధించి మంగళవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, మున్సిపల్‌ చైర్మన్లకు సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ప్రత్యేక అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా  కృషి చేయాలని సీఎం పిలుపు నిచ్చారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసే దిశగా అధికారయంత్రాంగం కార్యాచరణకు సిద్ధమైంది. 


ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారి

పట్టణ ప్రగతి కార్యక్రమ నిర్వహణకు గాను ఆయా మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం ఏర్పాటు  చేయనుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సర్కార్‌ తలంచింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఈ పథకం అమలుకు కార్యాచరణ తీసుకుంటున్నారు. జిల్లాలో మొత్తం ఐదు మున్సిపాలిటీల్లో 80 వార్డులున్నాయి. ఈ వార్డుల వారీగా నెలకొన్న సమస్యలను గుర్తించి పట్టణ ప్రగతిలో నిర్మూలించడానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అధికారులు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అవసరమైన వాటిని గుర్తించేందుకు కావాల్సిన చర్యలను కూడా అధికారులు పక్కాగా చేపట్టనున్నారు.


logo
>>>>>>