మంగళవారం 07 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 19, 2020 , 00:27:23

ప్రదక్షిణలకు స్వస్తి

ప్రదక్షిణలకు స్వస్తి

ప్రజలు మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరిగే పరిస్థితి ఇకపై ఉండదు. వివిధ పనుల నిమిత్తం వెళ్తే అధికారులు ఉంటారో లేదో.., ఒక వేళ అందుబాటులో ఉన్నా పనులు సకాలంలో అవుతాయో లేవో అనే అనుమానం ఉండేది..

  • వనపర్తి బల్దియాలో పౌరసేవలు
  • ప్రజలందరికీ అందుబాటులో మున్సిపల్‌ సేవలు
  • నెల రోజుల్లో పరిష్కారం కానున్న సమస్యలు
  • ఆలస్యం చేస్తే అధికారులకు జరిమానా

ప్రజలు మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరిగే పరిస్థితి ఇకపై ఉండదు. వివిధ పనుల నిమిత్తం వెళ్తే అధికారులు ఉంటారో లేదో.., ఒక వేళ అందుబాటులో ఉన్నా పనులు సకాలంలో అవుతాయో లేవో అనే అనుమానం ఉండేది.. దీనికి ముగింపు పలుకుతూ వనపర్తి బల్దియాలో అన్ని పౌర సేవలను ఒకే చోట ఏర్పాటు చేసి సిటిజన్‌ చార్టర్‌ను అమలు చేస్తున్నారు. ప్రజలు కార్యాలయానికి ఒకసారి వచ్చి తమ సమస్యను వివరిస్తే చాలు ఎన్ని రోజుల్లో పరిష్కారం అవుతుందో వివరిస్తున్నారు.. అధికారులకు సమస్యను వివరించి పరిష్కారం అయ్యాక సంబంధిత ఫిర్యాదుదారులకు సమాచారాన్ని చేరవేయనున్నారు.. ఒకవేళ అధికారులు నిర్ణీత గడువులోగా పరిష్కరించకపోతే జరిమానా సైతం విధించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.            - వనపర్తి, నమస్తే తెలంగాణ

వనపర్తి, నమస్తే తెలంగాణ : మున్సిపాలిటీ కార్యాలయం అంటేనే ప్రజ ల్లో ఒక రకమైన అనుమానం. వివి ధ పనుల నిమిత్తం వెళ్లిన సమయం లో అధికారులు అందుబాటులో ఉంటారో లేదో ఒక వేళ అందుబాటులో ఉన్న పనులు సకాలంలో అవుతాయో లేక కార్యాలయ చు ట్టూ పనులు మానుకుని ప్రదీక్షణలు చేసే పరిస్థితి గతంలో ఉండేది. ఇకపై అలాంటి వ్యవస్థకు స్వస్తి పలుకుతూ వనపర్తి మున్సిపాలిటీ కార్యాలయం లో ఈనెల 10వ తేదీన ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని సేవలు ఒకే చోట అంటూ అధికారులు పౌరసేవలు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా నూతన మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌ ప్రారంభించారు. దీంతో కార్యాలయానికి ఒకసారి వచ్చి తమ సమస్యను వివరిస్తే చాలు సౌరసేవల ప్రకారంగా ఎన్ని రోజుల్లో పరిష్కారం చేయాలో అన్ని రోజుల్లో సమస్య పరిష్కార దిశగా ముందుకు సాగడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. 
ఫిర్యాదుదారులకు సమాచారం చేరవేత..

కార్యాలయానికి వివిధ పనుల నిమి త్తం వచ్చే ప్రజలకు అధికారి ఉన్న లే కున్నా పౌరసేవ కేంద్రం వద్ద సమస్యను నమోదు చేస్తే చాలు ఆయా పరిధి ప్రకారంగా ఎన్ని రోజుల్లో సమస్య పరిష్కరించాలో అన్ని రోజు ల్లో సమస్య పరిష్కారం అవుతుంది. ముందుగా కార్యాలయానికి వచ్చిన ప్రజలకు ఇద్దరు సిబ్బంది వారితో మాట్లాడి మున్సిపాలిటీ కార్యాలయ ంలో ఏ శాఖకు సంబంధించి సమ స్య, పని ఉందో తెలుసుకుని వారి వివరాలను పూర్తి స్థాయిలో రికార్డు బుక్‌లో ఎంట్రీ చేసుకుంటారు. అనంతరం ఆ సమస్యను, పని విషయాన్ని సిబ్బంది అధికారుల వద్దకు తీసుకెళ్లి పరిష్కారం అయ్యాక సంబ ంధిత ఫిర్యాదుదారులకు సమాచారాన్ని చేరవేస్తారు.  


ఆలస్యం చేస్తే జరిమానా..

పౌర సేవలో పొందు పరిచిన రోజుల వారిగా అధికారులు ప్రజలకు సదుపాయాలను కల్పించకపోతే సంబంధిత అధికారులపై జరిమానాలు తప్పవని మున్సిపల్‌ కమిషనర్‌ రజినీకాంత్‌రెడ్డి తెలిపారు. సమయపాలన లేకున్నా విలువైన సమయాన్ని వృథా చేసినట్లయితే రోజుకు రూ. 50 చొప్పున, భవన నిర్మాణ అనుమతుల విషయంలో ప్రతి రోజుకు రూ.100 చొప్పున నష్ట పరిహారం చెల్లించనున్నట్లు కమిషనర్‌ వెల్లడించారు. 


ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి..

పౌర సేవలను అందుబాటులో ఉండేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఫిర్యాదు దారుడు ఇచ్చిన సమస్య కేంద్రంలో పొందు పరిచిన రోజులలో సమస్య పరిష్కారం కాని యెడల నేరుగా తమను సంప్రదించాలి. కేంద్రంలో ఫిర్యాదు ఇచ్చినట్లయితే సిబ్బంది సమస్యను శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసి ఫిర్యాదుదారుడికి సమాచారంను అందిస్తారు.         - మున్సిపల్‌ కమిషనర్‌ రజినీకాంత్‌ రెడ్డిlogo