శనివారం 04 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 18, 2020 , 00:38:41

డబుల్‌ హ్యాపీ

డబుల్‌ హ్యాపీ

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర అసెంబ్లీ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మంగళవారం వనపర్తి నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, కూరగాయల మార్కెట్‌, పార్కులను ఈ సందర్భంగా స్పీకర్‌, మంత్రి ప్రారంభిస్తారు. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ మంత్రు లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, మున్సిపల్‌ చైర్మన్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినందునా త్వరగా కార్యక్రమాల ను నిర్వహించుకునేలా ఏర్పాటు చేశారు. వీపనగండ్ల మండలంలోనూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.


92 డబుల్‌ బెడ్‌రూంలు..

వనపర్తి నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన 92 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను శాసన సభాపతి పోచారం, మంత్రి సింగిరెడ్డిలచే ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో ఖిల్లాఘణపురం కర్నెతండాలో 37 ఇండ్లు, గార్లబండతండాలో 10 ఇండ్లు, ఈర్లతండాలో 20 ఇండ్లు, రేవల్లి మండలం చెన్నారంలో 25 ఇండ్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. ఈ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఈ ఇండ్లను పంపిణీ చేయనున్నారు. మొత్తం 92 డబుల్‌ బెడ్‌ రూంలను దాదాపు రూ.5కోట్లతో ప్రభుత్వం చేపట్టింది. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల 4వేల రూపాయలను వెచ్చించి పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను ని ర్మాణం చేసి పంపిణీ చేయనున్నారు.


జిల్లా కేంద్రంలో..

జిల్లా కేంద్రంలో దాదాపు రూ.2 కోట్ల అభివృద్ధి పనులకు శాసన సభాపతి, మంత్రి ప్రారంభోత్సవం చేయనున్నారు. పట్టణంలోని కంద కం స్థలంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ను ఈ సందర్భం గా ప్రారంభిస్తారు. 14వ ఆర్థిక సం ఘం నిధుల నుంచి రూ.95లక్షలతో కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. అలాగే సీం హామీ నిధుల నుంచి రూ.40లక్షల వ్యయంతో చేపట్టిన నందిహిల్స్‌ పార్కు, టీయూఎఫ్‌ఐడీసీ నిధుల నుంచి రూ.40లక్షలతో నిర్మా ణం చేసిన బండార్‌నగర్‌ కాళోజి పార్కులను ఈ సందర్భంగా ప్రారంభోత్సవం చేయనున్నారు. పట్టణంలో పచ్చదనంలేని పార్కులతో ప్రజలు ఇంతకాలం అవస్థలు పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పట్టణంలోని 6 పా ర్కుల అభివృద్ధికి ప్రభుత్వం కోటి రూపాయలను మం జూరు చేసింది. పనులు పూర్తి చేసుకున్న వాటిని నేడు ప్రజలకు సౌకర్యవంతంగా ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చొరవతో జిల్లాలో అభివృద్ధి పనులు జోరు గా కొనసాగుతున్నాయి. ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. 

logo