శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 18, 2020 , 00:35:49

విండో పాలకవర్గం ఎన్నిక

విండో పాలకవర్గం ఎన్నిక

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సహకార సంఘా ల చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవుల ఎన్నికలు దాదాపు కొలి క్కి వచ్చాయి. ఒక్క నాగవరం సొసైటీ మినహా మిగిలిన సొసైటీల్లో కొత్త చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లు అధిరోహించా రు. ఇంకాను రేచింతల సొసైటీలోనూ వైస్‌ చైర్మన్‌ ఎన్ని క పెండింగ్‌లోనే ఉంది. సోమవారం చిన్నంబావి మం డలం కొప్పునూరు, వనపర్తి మండలం రాజనగరం సొ సైటీలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లతోపాటు వనపర్తి సొసైటీ లో వైస్‌ చైర్మన్‌లను ఎన్నుకున్నారు. నాగవరం సొసైటీలోను ఎన్నిక జరగాల్సి ఉండగా, అక్కడి ఎన్నికల అధికారికి అనారోగ్యం రావడంతో తాత్కాలికంగా వాయిదా పడింది. మళ్లి ఎన్నిక ఎప్పుడు నిర్వహించేది రాష్ట్ర స్థాయి అధికారుల సమాచారం మేరకు నిర్వహిస్తారు. అలాగే రేచింతల సొసైటీలో చైర్మన్‌ ఎన్నిక ఆదివారమే జరిగింది. కానీ, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా పడింది. ఈ వైస్‌ చైర్మ న్‌ ఎన్నిక కూడా అక్కడి పాలకవర్గం సభ్యుల తీర్మానం మేరకు ఎన్నికను నిర్వహిస్తారు. కాగా, కేవలం నాగవరంలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, రేచింతలలో వైస్‌ చైర్మన్‌ పదవులు మాత్రమే పెండిండ్‌లో ఉన్నాయి. ఇక మిగిలిన సొసైటీలకు నూతన పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. సోమవారం ఏర్పాటైన కొప్పునూరు సొసైటీ చైర్మన్‌గా బీ నరసింహరెడ్డి, వైస్‌ చైర్మన్‌గా విద్యాసాగర్‌రావు, రాజనగరం సొసైటీ చైర్మన్‌గా విజయ్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌గా రఘునాథ్‌ రెడ్డిలు ఎన్నికయ్యారు. అలాగే వనపర్తి సొసైటీ వైస్‌ చైర్మన్‌గా  పీ రాజు సాగర్‌లను ఎన్నుకున్నారు.


logo