శనివారం 04 ఏప్రిల్ 2020
Wanaparthy - Feb 18, 2020 , 00:29:10

ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

కొత్తకోట : రాష్ట్ర ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని, ఆయన జన్మదిన వేడుకలను రాష్ట్రమంతటా పండుగలా జరుపుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. సోమవారం మున్సిపల్‌ కేంద్రంలో సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని అంబాభవాని దేవాయలం నుంచి వెంకటగిరి వరకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. అలాగే మండల ప్రజాపరిషత్‌ కార్యాలయ ప్రాంగణంలో రైతులు, నాయకులతో కలిసి గులాబీ పూలు, వరి విత్తనాలను సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి చల్లుతూ వేడుకలు నిర్వహించారు.కేక్‌కట్‌ చేసి ఒకరికొకరు స్వీట్‌ పంచిపెట్టుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ప్రొఫెసర్‌ జయశంకర్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ రాజకీయాలు మాని ప్రజలకు సేవలు చేస్తూ పట్టణాన్ని, గ్రామాలను అభివృద్ధి చేసుకునే ఆలోచనతో ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలన్నారు. అనంతరం మండలంలోని కనిమెట్ట గ్రామానికి చెందిన ఆంజనేయులు, బోయబాబు, వడ్డెవాట గ్రామానికి చెందిన అబ్దుల్లాలకు మంజూరైన రైతుబీమా చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. 


అనంతరం బీపీఆర్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌ నుంచి మదనాపురం రోడ్డు ఫ్లైఓవర్‌ వరకు సైడ్‌ లైటింగ్‌, 44వ జాతీయ రహదారి బైపాస్‌ మల్లంబావి నుంచి మధర్‌థెరిస్సా జంక్షన్‌ బైపాస్‌ వరకు సైడ్‌ లైటింగ్‌, శివ గార్డెన్‌ నుంచి బాలాజీ పెట్రోల్‌ బంక్‌ వరకు బీటీ రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఆల ప్రారంభించారు. రూ.5.4కోట్ల నిధులతో పనులను ప్రారంభించడం జరిగిందని, త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అలాగే ఎంపీపీ గుంతమౌనిక నేతృత్వంలో శంకరసముద్ర ఆయకట్టు రైతులకు రూ.3 లక్షల విలువ చేసే మోటర్‌ పంపు సెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ వామన్‌గౌడ్‌, కొత్తకోట మున్సిపల్‌ చైర్మన్‌ సుకేశినివిశ్వేశ్వర్‌, సీడీసీ చైర్మన్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్‌, బాబు, మాజీ సర్పంచ్‌ బాలనారాయణ, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీను, నాయకులు భీంరెడ్డి, శ్రీనూజీ, హనుమంతుయాదవ్‌, బాలకృష్ణ, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, పీఏసీసీఎస్‌ డైరెక్టర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 


logo